News August 28, 2024

PHOTOS: తల్లికి ప్రేమతో ముద్దు పెట్టిన కవిత

image

TG: శంషాబాద్ నుంచి ర్యాలీగా బంజారాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత కుటుంబసభ్యులను చూసి భావోద్వేగానికి గురయ్యారు. తల్లి శోభను హత్తుకుని ఆప్యాయంగా ముద్దు పెట్టారు. తన ఇంటికి వచ్చిన BRS కార్యకర్తలకు సోదరుడు KTRతో కలిసి అభివాదం చేశారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.

Similar News

News September 17, 2024

చంద్రబాబు ఇంటిని ముందుగా కూలగొట్టాలి: ఎంపీ విజయసాయి

image

CM చంద్రబాబు అబద్ధాల రాజ్యానికి చక్రవర్తి అని YCP MP విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘సిగ్గు విడిచిన వ్యక్తికి తన తప్పు కనపడదనే నానుడి ఉంది. పాలకులకు ఒక న్యాయం పౌరులకు ఇంకొక న్యాయం ఉండదు. చట్టం ముందు అందరూ సమానులే. కృష్ణానది ఒడ్డుపై కట్టిన అక్రమ కట్టడంలో నివసిస్తున్న ఆయనకు బుడమేరు రివలెట్‌పై ఇళ్లను కూలగొట్టే నైతిక అధికారం ఎక్కడుంటుంది! అందుకే ముందుగా ఆయన నివాసాన్ని కూలగొట్టాలి’ అని ట్వీట్ చేశారు.

News September 17, 2024

నేనేమీ ఫామ్‌హౌస్ సీఎంను కాదు: రేవంత్

image

TG: ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రం, కేంద్రానికి మధ్య ఎన్నో సత్సంబంధాలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర నుంచి రావాల్సిన పన్నుల వాటాలు, నిధుల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తానని స్పష్టం చేశారు. దాన్ని కూడా కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంట్లో కాలు మీద కాలేసుకొని కూర్చోవడానికి తానేమీ ఫామ్‌హౌస్‌ ముఖ్యమంత్రిని కాదని తెలంగాణ ప్రజాపాలన వేడుకల సందర్భంగా ఎద్దేవా చేశారు.

News September 17, 2024

ఇన్వెస్టర్ల అప్రమత్తత.. రేంజుబౌండ్లో సూచీలు

image

బెంచ్‌మార్క్ సూచీలు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. US ఫెడ్ సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటున్నారు. కొనుగోళ్లలో దూకుడు ప్రదర్శించడం లేదు. సెన్సెక్స్ 82,915 (-78), నిఫ్టీ 25,366 (-16) వద్ద ట్రేడవుతున్నాయి. నిఫ్టీ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 25:25గా ఉంది. HDFC బ్యాంకు, ఎయిర్‌టెల్ షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. బ్రిటానియా, దివిస్ ల్యాబ్, LTIM, శ్రీరామ్ ఫైనాన్స్ టాప్ గెయినర్స్.