News January 16, 2025
PHOTOS: మహాకుంభమేళా.. రాత్రి వేళ ఇలా

పగలంతా భక్తులతో నిండిపోతున్న ప్రయాగ్ రాజ్ రాత్రిపూట విద్యుత్ కాంతుల్లో విరాజిల్లుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. రంగు రంగుల బల్బుల వెలుగుల్లో త్రివేణీ సంగమం భువిపై వెలసిన స్వర్గంలా ఉందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. కాగా మహాకుంభమేళాకు మూడు రోజుల్లో 6 కోట్ల మందికి పైగా హాజరయ్యారని సమాచారం.
Similar News
News January 21, 2026
స్మార్ట్ ఫోన్ యూజర్లకు త్వరలో కొత్త ఫీచర్!

గూగుల్ ఫొటోస్ యాప్లో మీడియా ఫైల్స్ బ్యాకప్ చేసినప్పుడు ఫోన్ ఛార్జింగ్ ఎక్కువగా అయిపోతుంటుంది. బ్యాక్గ్రౌండ్లో జరిగే సింకింగ్, ఆపరేషన్సే దీనికి కారణం. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఈ యాప్లో త్వరలో ‘ఆప్టిమైజ్ బ్యాకప్ ఫర్ బ్యాటరీ లైఫ్’ అనే ఫీచర్ రానుంది. ఇది అనవసరమైన సింకింగ్ను తగ్గించి బ్యాటరీ లైఫ్ను పెంచుతుంది. యాప్ ఓపెన్ చేసినప్పుడు లేదా ఫోన్ వాడనప్పుడు మాత్రమే బ్యాకప్ జరుగుతుంది.
News January 21, 2026
ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది: రోహిత్

టీ20 WCని ఈసారి ఇంట్లో కూర్చొని చూడటం తనకు స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ అవుతుందని రోహిత్ శర్మ అన్నారు. 2007 నుంచి 2024 వరకు అన్ని టీ20WCలలో తాను ఆడానని, ఈసారి స్టేడియంలో ఎక్కడో కూర్చొని లేదా ఇంటి నుంచి చూడటం డిఫరెంట్గా ఉంటుందన్నారు. గతంలో WCకి ముందు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు గుర్తుచేసుకున్నారు. స్క్వాడ్లో ఉన్న 15 మందిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు.
News January 21, 2026
పగిలిన గుడ్లు తక్కువ ధరకే.. తింటే ఇబ్బందులు

పగిలిన గుడ్లను షాపుల్లో తక్కువ ధరకే విక్రయించడం తెలిసిందేగా. కాస్త పగిలిందనో, కేవలం పగుళ్లే కదా అని తీసుకెళ్లి వండుకుంటున్నారా? అయితే మీరు అనారోగ్యానికి గురికావచ్చు. ఎగ్ పెంకు పగిలిందంటే లోపలికి బ్యాక్టీరియా వెళ్లి పాడవుతాయి. చూసేందుకు, వాసన మామూలుగా ఉన్నా లోపల క్రిములు డెవలప్ అవుతాయి. కాబట్టి తక్కువ ధరకే వస్తుందని వాటిని తింటే విరేచనాలు మొదలు ఒక్కోసారి తీవ్ర అస్వస్థతకు గురికావచ్చు.
Share It


