News January 16, 2025

PHOTOS: మహాకుంభమేళా.. రాత్రి వేళ ఇలా

image

పగలంతా భక్తులతో నిండిపోతున్న ప్రయాగ్ రాజ్ రాత్రిపూట విద్యుత్ కాంతుల్లో విరాజిల్లుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. రంగు రంగుల బల్బుల వెలుగుల్లో త్రివేణీ సంగమం భువిపై వెలసిన స్వర్గంలా ఉందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. కాగా మహాకుంభమేళాకు మూడు రోజుల్లో 6 కోట్ల మందికి పైగా హాజరయ్యారని సమాచారం.

Similar News

News February 18, 2025

అప్పులు చేయడానికి కేసీఆర్ రావాలా?: మంత్రి జూపల్లి

image

TG: కేసీఆర్‌పై మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శలకు దిగారు. ఆయన తిరిగి అధికారంలోకి రావాలని కోరుకునేది మళ్లీ అప్పులు చేయడానికేనా అని ప్రశ్నించారు. 10 ఏళ్ల తర్వాత కూడా నిరుద్యోగ సమస్య ఉందని దుయ్యబట్టారు. సర్పంచ్ బిల్లులు బకాయిలు పెట్టి ఇప్పుడు ఇవ్వట్లేదని అనడానికి కేటీఆర్‌కు సిగ్గుండాలని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో నాలుగు స్తంభాల ఆట నడిచిందని విమర్శించారు.

News February 18, 2025

బయట ఫుడ్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారా?

image

రెస్టారెంట్‌ ఫుడ్ తినడంలో చైనా, అమెరికా, సింగపూర్ దేశాలు ముందున్నాయి. ఈ విషయాన్ని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా దీనికి డా.సుధీర్ ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చారు. ‘ఇందులో మేము సింగపూర్ & ఇతర అభివృద్ధి చెందిన దేశాల కంటే వెనుకబడి ఉన్నా పర్లేదు. ఎందుకంటే ఇంట్లో వండిన ఆహారం అత్యంత ఆరోగ్యకరమైన ఎంపిక. బయట ఫుడ్ వల్ల ఊబకాయం, టైప్ 2 మధుమేహం, గుండెపోటు, స్ట్రోక్, క్యాన్సర్ వంటి సమస్యలు తలెత్తవచ్చు’ అని తెలిపారు.

News February 18, 2025

చంద్రబాబు సర్కారు కుట్రలు చేస్తోంది: YCP

image

AP: వల్లభనేని వంశీ అరెస్టు లక్ష్యంగా చంద్రబాబు సర్కారు కుట్రలు చేస్తోందని వైసీపీ ఆరోపించింది. గన్నవరం కేసులో అన్నీ కట్టుకథలు, కల్పితాలు, తప్పుడు సాక్ష్యాలేనని.. కోర్టు లో సత్యవర్ధన్ స్టేట్‌మెంటే ఇందుకు నిదర్శనమని తెలిపింది. ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని, ఎవరూ బలవంతం పెట్టలేదని ఆయన చెప్పారని పేర్కొంది.

error: Content is protected !!