News January 19, 2025

PHOTOS: మహాకుంభ్ నైట్ వ్యూ

image

యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా కొనసాగుతోంది. కోట్లాది మంది భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. రాత్రి వేళ ఆ ప్రాంతం విద్యుత్ దీపాల వెలుగుల్లో ఎలా ఉంటుందో పైన ఉన్న ఫొటోల్లో చూడవచ్చు. ఫిబ్రవరి 26 వరకు కుంభమేళా కొనసాగనుంది.

Similar News

News January 19, 2025

రియల్ హీరోస్..!

image

రెస్టారెంట్లలో నిత్యం వేలాది టన్నుల ఫుడ్ వేస్ట్ అవుతుంది. అలా వేస్ట్ కాకుండా ఫుడ్‌ను అన్నార్థులకు అందించేందుకు కొన్ని NGOలు ముందుకొస్తున్నాయి. కేవలం బెంగళూరులోనే నిత్యం 296 టన్నుల ఫుడ్ వేస్ట్ అవుతుంది. అక్కడ ‘హెల్పింగ్ హీరోస్ ఇండియా’ అనే సంస్థ ఫుడ్ సేకరించి పేదలకిస్తోంది. ముంబైలో రాబిన్ హుడ్ ఆర్మీ&ముంబై డబ్బావాలా, కోల్‌కతా వీ కేర్, చెన్నై&హైదరాబాద్‌లో ‘NO FOOD WASTE’ సంస్థలు సేవలు అందిస్తున్నాయి.

News January 19, 2025

శ్రీవారికి రూ.6 కోట్ల విరాళం

image

AP: తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్ అనే భక్తుడు ఒకేసారి రూ.6 కోట్ల మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. SVBC కోసం రూ.5 కోట్లు, గోసంరక్షణ ట్రస్టుకు రూ.కోటి విలువైన డీడీలను AEO వెంకయ్య చౌదరికి అందజేశారు. TTDకి చెందిన ట్రస్టులకు ఆయన గతంలోనూ భారీగా విరాళాలు ఇచ్చినట్లు సమాచారం.

News January 19, 2025

పదేళ్లలో ఆరోగ్యశ్రీని నీరుగార్చారు: దామోదర

image

TG: ఆరోగ్యశ్రీ <<15195303>>సేవలు<<>> నిలిచిపోయాయన్న మాజీ మంత్రి హరీశ్ రావుపై మంత్రి దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. ‘పదేళ్లు ఆరోగ్యశ్రీని నీరుగార్చారు. సుమారు రూ.730 కోట్లు బాకీ పెట్టి వెళ్లారు. మేం ఏడాదిలో పాత బకాయిలతో కలిపి రూ.1130 కోట్లు చెల్లించాం. ప్యాకేజీల రేట్లు రివైజ్ చేసి, 22శాతం మేర ఛార్జీలు పెంచాం. హాస్పిటళ్ల యాజమాన్యాల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.