News January 19, 2025

PHOTOS: మహాకుంభ్ నైట్ వ్యూ

image

యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా కొనసాగుతోంది. కోట్లాది మంది భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. రాత్రి వేళ ఆ ప్రాంతం విద్యుత్ దీపాల వెలుగుల్లో ఎలా ఉంటుందో పైన ఉన్న ఫొటోల్లో చూడవచ్చు. ఫిబ్రవరి 26 వరకు కుంభమేళా కొనసాగనుంది.

Similar News

News February 8, 2025

ప్రాంతీయ పార్టీలకు గడ్డుకాలం.. నెక్స్ట్ టార్గెట్ బెంగాలేనా?

image

దేశంలో ప్రాంతీయ పార్టీలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఏపీలో వైసీపీ, తెలంగాణలో BRS, ఒడిశాలో బిజూ జనతాదళ్, MHలో శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలు అధికారాన్ని కోల్పోయాయి. ఏపీలో టీడీపీ, బిహార్‌లో JDU ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్నాయి. ప.బెంగాల్‌లో మమతా బెనర్జీ, TNలో స్టాలిన్ బలంగా నిలబడ్డారు. మోదీ నెక్స్ట్ టార్గెట్ బెంగాల్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మీ కామెంట్?

News February 8, 2025

కేన్ విలియమ్సన్ మరో ఘనత

image

న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ మరో ఘనత అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో (టెస్టు, వన్డే, టీ20లు కలిపి) అత్యధిక పరుగులు చేసిన 17వ ఆటగాడిగా కేన్ నిలిచారు. ఇప్పటివరకు ఆయన 18,685 పరుగులు సాధించారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ హషీమ్ ఆమ్లా (18,672) రికార్డును చెరిపేశారు. పాక్‌తో జరుగుతున్న వన్డేలో కేన్ ఈ ఫీట్ సాధించారు. ఈ జాబితాలో సచిన్ (34,357) అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు.

News February 8, 2025

ఢిల్లీలో బీజేపీ గెలుపు చరిత్రాత్మకం: చంద్రబాబు

image

AP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం చరిత్రాత్మకమని సీఎం చంద్రబాబు అన్నారు. మోదీపై నమ్మకంతోనే ఢిల్లీ ప్రజలు బీజేపీని గెలిపించారని చెప్పారు. ‘ఢిల్లీలో రాజకీయ, వాయుకాలుష్యాన్ని ఆప్ సర్కార్ పట్టించుకోలేదు. చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఈ సమస్య నుంచి బీజేపీ గట్టెక్కిస్తుందని ప్రజలు నమ్మారు. భారత్‌కు సరైన సమయంలో వచ్చిన సరైన నాయకుడు మోదీ’ అని ఆయన పేర్కొన్నారు.

error: Content is protected !!