News July 8, 2024

PHOTOS: పూరీ తీరంలో రాష్ట్రపతి

image

ఒడిశాలోని పూరీ సముద్ర తీరంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మార్నింగ్ వాక్ చేశారు. ‘తీరం వెంబడి నడుస్తున్నపుడు అలల సవ్వడి, చల్లని గాలి, సముద్రపు హోరు ధ్యానం చేస్తున్న అనుభూతిని కలిగించాయి. నిన్న జగన్నాథుడిని దర్శించినపుడు ఇలాంటి అనుభవమే కలిగింది’ అని Xలో పేర్కొన్నారు. ప్రకృతి వనరులు మనల్ని ఎంతగానో ఆకర్షిస్తాయని, అలాంటి ప్రకృతిని ధ్వంసం కాకుండా భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

Similar News

News October 6, 2024

రికార్డుల గురించి ఆలోచించను: రూట్

image

జట్టు విజయానికి సహకరించడమే తనను ముందుకు నడిపిస్తుందని ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ అన్నారు. వ్యక్తిగతంగా ఆటను ఆస్వాదిస్తానని, తానెప్పుడూ రికార్డుల గురించి ఆలోచించనని పేర్కొన్నారు. తాను క్రికెట్ ఆడుతున్నంత వరకు టెస్టుల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తానని తెలిపారు. కాగా, టెస్టుల్లో రూట్ మరో 71 రన్స్ చేస్తే అలిస్టర్ కుక్ (12,472)ను అధిగమించి అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లండ్ ఆటగాడిగా నిలుస్తారు.

News October 6, 2024

ఘోరం.. కుటుంబంలో ఒక్కడే మిగిలాడు!

image

AP: ఆన్‌లైన్ బెట్టింగ్ ఓ కుటుంబంలో చీకట్లు నింపింది. చిత్తూరు జిల్లాలోని జీడీనెల్లూరుకు చెందిన దినేశ్ బెట్టింగ్‌కు అలవాటు పడి ఏడాది క్రితం ఇంటి స్థలాన్ని అమ్మేశాడు. అయినా వదలక మరిన్ని అప్పులు చేశాడు. సొంతింటిపై లోన్ కోసం ప్రయత్నించాడు. అప్పు తీర్చే మార్గం లేక దినేశ్, తండ్రి నాగరాజుల రెడ్డి, తల్లి జయంతి, సోదరి సునీత శుక్రవారం పురుగు మందు తాగారు. ముగ్గురు చనిపోగా, దినేశ్ పరిస్థితి విషమంగా ఉంది.

News October 6, 2024

TTDకి లక్ష గోవులను ఉచితంగా సమకూరుస్తా: రామచంద్రయాదవ్

image

AP: తిరుమలలో ప్రసాదాల తయారీకి నెయ్యి పరిష్కారం కోసం సొంత డెయిరీని ఏర్పాటుచేయాలని సీఎం చంద్రబాబును BCY పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ కోరారు. దీనికి ప్రభుత్వం సిద్ధమైతే తాను వెయ్యి గోవులను ఇస్తానని లేఖ రాశారు. మరో లక్ష ఆవులను ఉచితంగా సమకూరుస్తానని చెప్పారు. ‘వీటితో రోజుకు కనీసం 10 లక్షల లీటర్ల పాలు వస్తాయి. ఇందులో నుంచి 50వేల కేజీల వెన్న తీసి 30వేల కేజీల నెయ్యి తయారుచేయొచ్చు’ అని పేర్కొన్నారు.