News October 6, 2024
PHOTOS: ముత్యాల పందిరిలో శ్రీనివాసుడి విహారం

తిరుమల బ్రహ్మోత్సవాలు మూడో రోజు కనులపండువగా సాగాయి. ఇవాళ శ్రీమలయప్పస్వామి ముత్యాల పందిరిపై విహరించారు. శ్రీవారిని దర్శించుకొని భక్తులు తన్మయత్వం పొందారు. తిరుమల గిరులు శ్రీనివాసుడి నామస్మరణతో మార్మోగాయి. వేంకటేశ్వరుడి విహారం సందర్భంగా మాడవీధుల్లో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
Similar News
News December 2, 2025
లేజర్ వెపన్ ‘ఐరన్ బీమ్’ సిద్ధం చేసిన ఇజ్రాయెల్!

అత్యాధునిక, హైపవర్ లేజర్ రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ సిద్ధం చేసింది. ‘ఐరన్ బీమ్’ను డిసెంబర్ 30న దళాలకు ఇస్తామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రకటించింది. విమానాలు, క్షిపణులు, రాకెట్లు, UAVs, డ్రోన్లను భూమిపై నుంచే ఛేదించేలా రూపొందించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇది. 2014లోనే ఐరన్ బీమ్ను ఇజ్రాయెల్ ఆవిష్కరించింది. కానీ 11 ఏళ్లుగా అభివృద్ధి దశలోనే ఉంది. ఆ ప్రక్రియను పూర్తి చేసి సైన్యానికి అందించనుంది.
News December 2, 2025
ఇవి వాడితే పంటకు రక్షణ, దిగుబడికి భరోసా

సాగులో ప్రకృతి వైపరీత్యాల కంటే చీడపీడలతోనే ఎక్కువ నష్టం జరుగుతోంది. ఈ సమస్య నివారణకు లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలు, లైట్ ట్రాప్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇవి పురుగులను ఆకర్షించి, నిర్మూలించి వాటి ఉద్ధృతి పెరగకుండా కట్టడి చేస్తున్నాయి. దీంతో పురుగు మందుల వినియోగం తగ్గి, పర్యావరణానికి, మిత్రపురుగులకు మేలు జరుగుతోంది. ఏ పంటకు ఏ పరికరం వాడితే లాభమో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 2, 2025
iBOMMA రవిపై మరో 3 కేసులు, 14 రోజుల రిమాండ్

iBOMMA రవిని పోలీసులు మరో 3 కేసుల్లో అరెస్టు చేశారు. మంచు విష్ణు, దిల్ రాజు, తండేల్ మూవీ పైరసీ పట్ల మొత్తం 3 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటికే జైల్లో ఉన్న అతడికి నాంపల్లి కోర్టు మరో 14 రోజుల పాటు జుడీషియల్ రిమాండ్ విధించింది. రవికి బెయిల్ మంజూరు చేయవద్దని, విదేశాలకు వెళ్లిపోయి ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ తరఫు లాయర్ వాదించారు. దీంతో బెయిల్ పిటిషన్ విచారణ బుధవారానికి వాయిదా పడింది.


