News October 6, 2024

PHOTOS: ముత్యాల పందిరిలో శ్రీనివాసుడి విహారం

image

తిరుమల బ్రహ్మోత్సవాలు మూడో రోజు కనులపండువగా సాగాయి. ఇవాళ శ్రీమలయప్పస్వామి ముత్యాల పందిరిపై విహరించారు. శ్రీవారిని దర్శించుకొని భక్తులు తన్మయత్వం పొందారు. తిరుమల గిరులు శ్రీనివాసుడి నామస్మరణతో మార్మోగాయి. వేంకటేశ్వరుడి విహారం సందర్భంగా మాడవీధుల్లో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

Similar News

News November 3, 2024

ALERT.. రేపు వర్షాలు

image

APలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ పలుచోట్ల వర్షాలు పడ్డాయి.

News November 3, 2024

ఝార్ఖండ్‌లో మహిళల ఓట్లే ల‌క్ష్యం

image

ఝార్ఖండ్‌లో గెలుపు కోసం JMM, BJP కూట‌ములు మ‌హిళా ఓటర్ల‌ను ఆక‌ట్టుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. రాష్ట్రంలోని 81 నియోజ‌క‌వ‌ర్గాల్లో 32 స్థానాల్లో మ‌హిళా ఓటర్లే ఎక్కువ‌గా ఉన్నారు. వీరి మెప్పు పొందేందుకు JMM ప్ర‌భుత్వం ఇప్ప‌టికే మహిళల ఖాతాల్లో నెలకు రూ.1000 సాయం ఇస్తోంది. మరోవైపు ప్ర‌తి నెల మ‌హిళ‌ల‌కు రూ.2,100 ఆర్థిక సాయం ఇస్తామ‌ని బీజేపీ హామీ ఇచ్చింది. మ‌రి మ‌హిళ‌ల ఓటు ఎట‌న్న‌ది తేలాల్సి ఉంది.

News November 3, 2024

మధ్యంతర భృతి ప్రకటించాలని జేఏసీ వినతి

image

AP: ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించాలని AP JAC అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే 18 అంశాలను CM చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. హెల్త్ కార్డులు పని చేయడం లేదని, క్యాష్ లెస్ వైద్య సదుపాయం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు ₹25 వేల కోట్ల వరకు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. విశ్రాంత ఉద్యోగుల బకాయిలైనా చెల్లించాలని కోరారు.