News November 5, 2024

PIC OF THE DAY: కొడుకు, కూతురితో కోహ్లీ

image

టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ బర్త్ డే సందర్భంగా ఆయన భార్య అనుష్క శర్మ ఇన్‌స్టాలో ఓ ఫొటోను షేర్ చేశారు. కూతురు వామిక, కొడుకు అకాయ్‌తో కోహ్లీ సరదాగా గడిపిన సందర్భాన్ని ఫొటోలో చూపించారు. అయితే, ఇద్దరు పిల్లల ముఖాలు కనిపించకుండా స్టిక్కర్‌తో కవర్ చేశారు. ఈ ఫొటోను కోహ్లీ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

Similar News

News December 3, 2024

సినిమా టికెట్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయంటే?

image

ఒకప్పుడు థియేటర్‌లో ఫ్యాన్ సౌండ్ మోత భరిస్తూ సినిమా చూసేవాళ్లం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారి సెంట్రల్ ఏసీలు, ప్రీమియం సీటింగ్ వంటి లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి. దీంతో టికెట్ ధరలూ పెరిగిపోతున్నాయి. పాన్ ఇండియా మూవీలకు అసలు బడ్జెట్ కంటే అదనంగా ఖర్చు చేస్తున్నారు. ఇది కూడా టికెట్ రేట్ల పెంపునకు ఓ కారణం. హీరో హీరోయిన్ల రెమ్యునరేషన్లు, భారీ సెట్లు, లొకేషన్లు, VFXల కారణంగా ధరలు అధికంగా పెరుగుతున్నాయి.

News December 3, 2024

త్వరలో పుతిన్ భారత్ పర్యటన

image

వచ్చే ఏడాది ఆరంభంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు వస్తున్నారు. ఈ విషయాన్ని రష్యా అధ్యక్ష ఫారిన్ పాలసీ అడ్వైజర్ యూరీ యుషాకోవ్ తెలిపారు. త్వరలోనే పుతిన్ పర్యటన తేదీలు ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. కాగా ఇటీవల జరిగిన 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలకు హాజరైనప్పుడు పుతిన్‌ను తమ దేశంలో పర్యటించాల్సిందిగా ప్రధాని మోదీ కోరారు. దీంతో మోదీ ఆహ్వానం మేరకు పుతిన్ ఇక్కడికి వస్తున్నారు.

News December 3, 2024

గుండు చేయిస్తే జుట్టు మందం అవుతుందా?

image

తలపై జుట్టు పలుచగా ఉంటే గుండు చేయించుకోవడం వల్ల మందంగా మొలుస్తుందని చాలామంది నమ్ముతుంటారు. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని వైద్యులు అంటున్నారు. తలపై హెయిర్ సెల్స్ పుట్టుకతోనే ఉంటాయని, గుండు చేయించినంత మాత్రాన వాటి సంఖ్య పెరగదని చెబుతున్నారు. గుండు చేయించడం వల్ల వెంట్రుకలు మాత్రం మందంగా తయారయ్యే అవకాశం ఉందంటున్నారు. అంతేకానీ తలపై వెంట్రుకలు ఎక్కువవడం సాధ్యం కాదంటున్నారు.