News April 27, 2024

గూగుల్‌లో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న పిచాయ్

image

గూగుల్ CEO సుందర్ పిచాయ్ ఆ కంపెనీలో 20 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ప్రొడక్ట్ మేనేజర్‌గా ఆ సంస్థలో చేరిన ఆయన ఇప్పుడు CEOగా పనిచేస్తున్నారు. ‘ఏప్రిల్ 26, 2004 Googleలో నా మొదటి రోజు. అప్పటి నుంచి టెక్నాలజీ, మా ప్రొడక్ట్స్‌ను వాడే వ్యక్తుల సంఖ్య, నా జుట్టు ఇలా చాలా మారాయి. కానీ ఈ కంపెనీలో పని చేయడం వల్ల పొందే థ్రిల్ మాత్రం మారలేదు. నేనింకా లక్కీ అని ఫీల్ అవుతున్నా’ అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు.

Similar News

News November 13, 2024

నేడు సభలో కీలక బిల్లులు

image

AP: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం ఈరోజు సభలో కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు అనే నిబంధనను తొలగిస్తూ చట్టాల్లో సవరణకు ఒక బిల్లుతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు సవరణ బిల్లు స్పీకర్ ముందుకు తీసుకురానున్నారు. కాగా ఈ సమావేశాలు నవంబర్ 22 వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే.

News November 13, 2024

నేడు ఝార్ఖండ్‌లో తొలి దశ పోలింగ్

image

ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. తొలిదశలో 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఆయా స్థానాల్లో కలిపి మొత్తం 683 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా అందులో కేవలం 73 మంది మాత్రమే మహిళలున్నారు. రాష్ట్రంలో మొత్తం 1,37,00,000 మంది ఓటర్ల కోసం 15,344 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు.

News November 13, 2024

‘మిషన్ ఇంపాజిబుల్’లో బాలీవుడ్ బ్యూటీ?

image

బాలీవుడ్ బ్యూటీ అవనీత్ కౌర్ హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్‌ని కలిశారు. ‘మిషన్ ఇంపాజిబుల్’ సెట్లో ఆయనతో కలిసి ఫొటో దిగారు. క్రూజ్‌ను కలవడం కలలా ఉందని ఆమె ఇన్‌స్టాలో పోస్టు చేయగా బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యపోతున్నారు. దానిపై మిషన్ ఇంపాజిబుల్ ఇన్‌స్టా పేజీ కూడా స్పందించింది. కాగా అవనీత్ ఈ మూవీతో హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం మొదలైంది.