News May 12, 2024

పంది కిడ్నీ అమర్చుకున్న వ్యక్తి మృతి

image

వైద్య చరిత్రలో తొలిసారి జన్యుపరంగా మార్పిడి చేసిన పంది కిడ్నీని అమర్చుకున్న వ్యక్తి రిచర్డ్ స్లేమ్యాన్(62) కన్నుమూశారు. ఇతనికి మసాచుసెట్స్ హాస్పిటల్‌(US) వైద్యులు మార్చిలో విజయవంతంగా ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం సడన్‌గా మరణించడానికి గల కారణాలు తెలియరాలేదు. సర్జరీ సమస్యలతో కాదని ఆస్పత్రి స్పష్టం చేసింది. రిచర్డ్ ఆపరేషన్‌కు ముందు టైప్-2 డయాబెటిస్, హైపర్‌టెన్షన్‌తో బాధపడేవారని కుటుంబసభ్యులు తెలిపారు.

Similar News

News October 15, 2025

పప్పులో కాలేసిన ఇన్వెస్టర్లు.. LG అనుకొని!

image

దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం ‘LG ఎలక్ట్రానిక్స్‌’ స్టాక్‌మార్కెట్‌లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఇన్వెస్టర్లు షేర్లు కొనేందుకు ఎగబడ్డారు. అయితే చాలామంది సరైన కంపెనీని సెర్చ్ చేయకుండా పప్పులో కాలేశారు. LG ఎలక్ట్రానిక్స్‌కి బదులు పొరపాటున LG బాలకృష్ణన్ & బ్రదర్స్ లిమిటెడ్ షేర్లు కొనేశారు. దీంతో ఈ కంపెనీ షేర్లు ఒక్కసారిగా 20% పెరిగిపోయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

News October 15, 2025

రేపు ఏపీలో పర్యటిస్తున్నా: మోదీ

image

గురువారం ఏపీలో పర్యటించనున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ముందుగా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం కర్నూలులో రూ.13,400 కోట్ల విలువైన అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటానని పేర్కొన్నారు. అంతకుముందు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే.

News October 15, 2025

ఇతిహాసాలు క్విజ్ – 36 సమాధానాలు

image

1. దశరథుడి తల్లి ఇందుమతి.
2. పాండవులు ఒక సంవత్సరం అజ్ఞాతవాసంలో ఉంటారు.
3. విష్ణువు ధనస్సు పేరు ‘సారంగం’.
4. తెలంగాణలోని భద్రాచలం ఆలయం గోదావరి నది ఒడ్డున ఉంది.
5. శుక అంటే చిలుక అని అర్థం.
<<-se>>#Ithihasaluquiz<<>>