News February 4, 2025
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటును సవాల్ చేస్తూ పిల్

AP: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటును సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాదులు తాండవ యోగేశ్, తురగా సాయి సూర్య ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసి సీఎస్, న్యాయశాఖ కార్యదర్శి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ప్రతివాదులుగా చేర్చారు. జస్వంత్ సింగ్ నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేస్తున్నారని పిటిషన్‌లో వివరించారు. రేపు ఈ పిల్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.
Similar News
News February 12, 2025
స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం సమీక్ష సమావేశం

TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష సమావేశం ప్రారంభమైంది. రిజర్వేషన్లు, ఎన్నికల సన్నాహాలపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సీతక్క, ఉత్తమ్, సీఎస్ శాంతికుమారి, కలెక్టర్లు ఇతర అధికారులకు ఆయన వివరించనున్నారు. మరోవైపు ఎన్నికలు ఏకగ్రీవం కాకుండా నిర్వహించాలని రాజకీయ పార్టీలతో ఈసీ చర్చించనుంది.
News February 12, 2025
బర్డ్ ఫ్లూపై మంత్రి ఆదేశాలు

AP: ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కోళ్ల మృతిపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో వెటర్నరీ వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. చనిపోయిన కోళ్లను పరిశీలించి శాంపిల్స్ ల్యాబుకు పంపాలన్నారు. పరిస్థితిని బట్టి జోన్లు ఏర్పాటు చేయాలని, పూర్తిస్థాయిలో సర్వైలెన్స్ ఉండాలని స్పష్టం చేశారు. పౌల్ట్రీల వద్ద బయో సెక్యూరిటీ మెజర్స్ అమలు చేయాలని ఆదేశించారు.
News February 12, 2025
వాలంటైన్స్ వీక్: ఇవాళ HUG DAY

ప్రేమను వ్యక్తపరిచేందుకు అనేక రకాల మార్గాలున్నాయి. ఫిజికల్ ఎఫెక్షన్‌ను చూపించేందుకు వాలంటైన్స్ వీక్‌లో ఇవాళ హగ్ డే జరుపుకొంటారు. ప్రేమను, ధైర్యాన్ని, భరోసాను ఇలా వ్యక్తపరుస్తూ ఈ రోజును సెలబ్రేట్ చేసుకుంటారు. హగ్ ఇవ్వడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఒత్తిడి తగ్గడమే కాకుండా బీపీ కంట్రోల్‌లో ఉంటుందట. హాయికరమైన నిద్ర, నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని అంటున్నారు.