News December 6, 2024
నేటి నుంచే పింక్ బాల్ టెస్ట్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నేటి నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. అడిలైడ్‌లో జరిగే ఈ డే అండ్ నైట్ మ్యాచ్‌ను పింక్ బాల్‌తో ఆడతారు. ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్ ఛానల్, డిస్నీ+హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు. తొలి టెస్టు గెలిచిన జోష్‌లో టీమ్ ఇండియా రెండో టెస్టుకు సిద్ధమైంది. మరోవైపు ఆసీస్ ఈ మ్యాచ్‌లో గెలిచి ఆధిక్యం సమం చేయాలని భావిస్తోంది.
Similar News
News January 7, 2026
సచిన్ ఇంట పెళ్లి బాజాలు.. అర్జున్ పెళ్లి డేట్ ఫిక్స్!

సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. తన లాంగ్‌టైమ్ పార్ట్నర్, వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌తో అర్జున్ పెళ్లి మార్చి 5న జరగనున్నట్లు TOI పేర్కొంది. 2025 ఆగస్టులోనే వీరి నిశ్చితార్థం సీక్రెట్‌గా జరిగింది. మార్చి 3 నుంచి ముంబైలో పెళ్లి వేడుకలు షురూ కానున్నాయి. ఇటీవలే అర్జున్ నిశ్చితార్థాన్ని సచిన్ ధ్రువీకరించారు.
News January 7, 2026
₹5800 CRతో మూసీ పునరుజ్జీవనానికి ముహూర్తం ఫిక్స్

TG: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రూ.5800 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు తొలిదశ పనులకు ఉగాది నాడు CM రేవంత్ శంకుస్థాపన చేస్తారు. గండిపేట నుంచి బాపుఘాట్ వరకు, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 21 KM మేర నదిని సుందరీకరణ చేస్తారు. ముందుగా నదిలో పూడిక తీసి తీరప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. ఆపై గోదావరి నీరు ప్రవహించేలా ప్రణాళికను రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
News January 7, 2026
పసుపు పంట కోతకు వచ్చినట్లు ఎలా గుర్తించాలి?

పసుపు రకాన్ని బట్టి పంట కాలం 7 నుంచి 9 నెలలుగా ఉంటుంది. పసుపు పంట పక్వానికి వచ్చిన తర్వాతే కోత కోయడం ప్రారంభించాలి. పక్వానికి రాకముందే పంట కోత చేపడితే దిగుబడి తగ్గడంతో పాటు, కుర్కుమిన్ శాతం కూడా తక్కువగా ఉంటుంది. దీని వల్ల దిగుబడిలో నాణ్యత లోపిస్తుంది. మొక్కల ఆకులు పాలిపోయి, తర్వాత ఎండిపోయి నేలపై పడిపోతే పంట కాలం పూర్తి అయ్యిందని గుర్తించవచ్చు. ఈ దశలో దుంపలను, కొమ్ములను తవ్వి తీయాలి.


