News December 6, 2024
నేటి నుంచే పింక్ బాల్ టెస్ట్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నేటి నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. అడిలైడ్‌లో జరిగే ఈ డే అండ్ నైట్ మ్యాచ్‌ను పింక్ బాల్‌తో ఆడతారు. ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్ ఛానల్, డిస్నీ+హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు. తొలి టెస్టు గెలిచిన జోష్‌లో టీమ్ ఇండియా రెండో టెస్టుకు సిద్ధమైంది. మరోవైపు ఆసీస్ ఈ మ్యాచ్‌లో గెలిచి ఆధిక్యం సమం చేయాలని భావిస్తోంది.
Similar News
News February 12, 2026
‘వారణాసి’ బడ్జెట్ రూ.1,300కోట్లు?

సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకొచ్చింది. ఈ చిత్రం బడ్జెట్ ‘RRR’ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ (రూ.1,200 కోట్లు) కంటే ఎక్కువ అని సినీవర్గాలు చెబుతున్నాయి. అటు అంతర్జాతీయ మీడియా ‘వెరైటీ’ సైతం వారణాసి బడ్జెట్ దాదాపు రూ.1,300 కోట్లు($150M) అని పేర్కొంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదలవనుంది.
News February 12, 2026
గ్లోబల్ మార్కెట్లో నరవణె బుక్.. ప్లాన్ ప్రకారమే లీక్!

ఆర్మీ మాజీ చీఫ్ నరవణె <<19103224>>పుస్తకం లీక్<<>>పై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రక్షణ శాఖ అనుమతి లేకున్నా గ్లోబల్ మార్కెట్లో అమ్మకాలు జరిపినట్లు తెలుస్తోంది. ఇది పక్కా ప్లాన్ ప్రకారం, సమన్వయంతో చేసిన లీక్ అని పోలీసు వర్గాలు తెలిపాయి. పుస్తకం US, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియాలో అందుబాటులోకి వచ్చినట్లు చెప్పాయి. దీంతో ఆ దేశాల్లో డిజిటల్, ఫైనాన్షియల్ మార్గాలను ట్రాక్ చేస్తున్నట్లు వెల్లడించాయి.
News February 12, 2026
జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్లు

2023లో USలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని మరణించిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల(23)కి న్యాయం దక్కింది. ఆమె కుటుంబానికి $29 మిలియన్లు(రూ.262 కోట్లు) ఇచ్చేందుకు సియాటెల్ సిటీ విభాగం అంగీకరించింది. ‘జాహ్నవి మృతి బాధాకరం. ఆమె కుటుంబానికి ఆర్థిక సహకారం కొంత మేలు చేకూరుస్తుందని ఆశిస్తున్నాం’ అని న్యాయవాది ఎరికా వెల్లడించారు. ఆమె మరణానికి <<13652111>>విలువలేదంటూ<<>> పోలీస్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనమయ్యాయి.


