News January 17, 2025
లోకల్ ఛానల్స్‌లో పైరసీ మూవీలు.. దిల్ రాజు వార్నింగ్

ప్రైవేటు వెహికల్స్, లోకల్ ఛానల్స్‌లో అనుమతి లేకుండా కొత్త సినిమాలను ప్రదర్శిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిర్మాత, తెలంగాణ FDC ఛైర్మన్ దిల్ రాజు హెచ్చరించారు. ఇటీవల కొత్త సినిమాలను పర్మిషన్ లేకుండా ప్రదర్శిస్తున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఇలా అక్రమంగా ప్రదర్శించడం వల్ల సినిమాలపై ఆధారపడి జీవిస్తున్న వారికి నష్టం వాటిల్లుతుందన్నారు.
Similar News
News February 18, 2025
మహిళలు, BC, SC, STలకు శుభవార్త

AP: సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేసుకునే మహిళలు, BC, SC, ST, మైనార్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు GOVT శుభవార్త చెప్పింది. వారి మూలధన పెట్టుబడిలో ప్లాంటు, యంత్రాలపై రాయితీని 35 నుంచి 45 శాతానికి పెంచింది. విద్యుత్ టారిఫ్‌లోనూ ప్రోత్సాహకాలు కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. MSMEలు నెలకొల్పే SC, STలకు భూమి విలువలో 75% రాయితీ(గరిష్ఠంగా ₹25L) కల్పిస్తూ మరో GO ఇచ్చింది.
News February 18, 2025
ఈకలు లేని కోడిని చూశారా?

AP: సాధారణంగా ఏ కోడికైనా ఈకలు ఉండటం సహజం. అయితే ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం దేవినేనివారిగూడెంలో ఈకలు లేని నాటు కోడి ఆశ్చర్యపరుస్తోంది. ఇది పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉందని, దీని వయసు 6 నెలలని యజమాని ఇస్మాయిల్ చెప్పారు. జన్యుపరమైన లోపం కారణంగా ఇలాంటి అరుదైన లక్షణాలు కోళ్లలో ఉంటాయని వైద్యాధికారులు తెలిపారు.
News February 18, 2025
హైడ్రాపై హైకోర్టు మరోసారి సీరియస్

TG: రాత్రికి రాత్రే హైదరాబాద్‌ను మార్చలేరంటూ హైడ్రాపై హైకోర్టు మరోసారి మండిపడింది. శనివారం విచారణ చేపట్టి, ఆదివారం కూల్చివేతలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారాంతాల్లో చర్యలు చేపట్టొద్దని సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు స్పష్టంగా ఉన్నా అందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. కూల్చివేతలపై హైడ్రా ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ హాజరై వివరణ ఇవ్వాలంటూ విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.