News November 7, 2024
పాక్-ఇంగ్లండ్ సిరీస్‌లో పిచ్‌లు ఓకే: ఐసీసీ
పాక్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ పిచ్‌లు సంతృప్తికరంగానే ఉన్నాయని పేర్కొంటూ ఐసీసీ తాజాగా రేటింగ్ ఇచ్చింది. తొలి మ్యాచ్‌లో ముల్తాన్ పిచ్ బౌలర్లకు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. పాక్ 556, ఇంగ్లండ్ 823 రన్స్ చేశాయి. రెండో మ్యాచ్‌లో అదే పిచ్‌పై, మూడో మ్యాచ్‌లో రావల్పిండి పిచ్‌పై బంతి తొలి రోజు నుంచే స్పిన్ అయింది. దీంతో ఇంగ్లండ్ 1-2 తేడాతో సిరీస్ కోల్పోయింది.
Similar News
News December 9, 2024
కేజీ టమాటా రూపాయి
AP: నిన్నమొన్నటి వరకు రైతులకు లాభాలు ఆర్జించి పెట్టిన టమాటా ఒక్కసారిగా పతనమైంది. కర్నూలు జిల్లా పత్తికొండలో కిలో టమాటా ధర ఏకంగా రూపాయికి పడిపోయింది. దీంతో గిట్టుబాటు ధర లేక అన్నదాతలు టమాటాలను పారబోస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ సహా పలు నగరాల్లో కేజీ టమాటా రూ.30-40 పలుకుతోంది.
News December 9, 2024
పుష్ప క్రేజ్: ఆప్-బీజేపీ మధ్య పోస్టర్ వార్
పుష్ప మేనియా ఢిల్లీని ఊపేస్తోంది. Febలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో రాజకీయ పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలకు పుష్ప పోస్టర్లను వాడుకుంటున్నాయి. ఢిల్లీలో కేజ్రీవాల్-4, తగ్గేదే లే అంటూ ఆప్ పోస్టర్ విడుదల చేసింది. దీనికి కౌంటర్‌గా ఆప్ అవినీతిని ఇక అంతం చేస్తామని, రప్పా రప్పా అంటూ పార్టీ స్టేట్ చీఫ్ వీరేంద్రతో కూడిన పోస్టర్‌ను BJP విడుదల చేసింది.
News December 9, 2024
మహ్మద్ యూనస్‌తో విక్రమ్ మిస్త్రీ బృందం భేటీ
బంగ్లా తాత్కాలిక చీఫ్ మహ్మద్ యూనస్‌తో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ బృందం సమావేశమైంది. సోమవారం ఇరుదేశాల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం యూనస్‌ను కలిసింది. ఇరుదేశాల మధ్య అన్ని రంగాల్లో సహకారం కొనసాగింపు, సంయుక్త ప్రయోజనాలపై కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు భారత్ పేర్కొంది. అలాగే బంగ్లాలో మైనారిటీల భద్రతకు భరోసా కల్పించాలని కోరింది.