News April 25, 2024
మే 13న దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వాలి: CBN

AP: టీడీపీ మహిళలకు పుట్టినిల్లు అని, తాను మొదటి నుంచి మహిళా పక్షపాతిని అని చంద్రబాబు అన్నారు. ‘YCP పాలనలో ప్రజలు ఇబ్బంది పడ్డారు. నిత్యావసరాలు సహా అన్నింటి ధరలు పెంచేశారు. ఆడబిడ్డలను లక్షాధికారులను చేయడమే నా లక్ష్యం. స్థలం లేని వారికి 2, 3 సెంట్లు ఇప్పించి ఇళ్లు కట్టిస్తాం. మేం వచ్చాక రూ.4వేలు పెన్షన్ ఇస్తాం. YCPని బంగాళాఖాతంలో కలిపేయాలి. మే 13న దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వాలి’ అని పిలుపునిచ్చారు.
Similar News
News November 26, 2025
IIIT-నాగపుర్‌లో ఉద్యోగాలు

<
News November 26, 2025
టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం

AP: ఇటీవల ఉదయ్‌పూర్‌లో అట్టహాసంగా కూతురి పెళ్లి చేసిన బిలియనీర్ మంతెన రామలింగరాజు తిరుమల శ్రీవారికి భారీ విరాళం ప్రకటించారు. PAC 1,2,3 భవనాల ఆధునికీకరణ కోసం కూతురు నేత్ర, అల్లుడు వంశీ పేరిట రూ.9కోట్లు ఇచ్చినట్లు TTD ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. రామలింగరాజు 2012లోనూ శ్రీవారికి రూ.16 కోట్ల భారీ విరాళం ఇచ్చారు. ఇటీవల ఆయన కూతురి వివాహానికి ట్రంప్ కుమారుడు సహా హాలీవుడ్ దిగ్గజాలు తరలివచ్చారు.
News November 26, 2025
పలాశ్ను అన్‌ఫాలో చేసిన స్మృతి.. నిజమిదే!

కాబోయే భర్త పలాశ్ ముచ్చల్‌తో పెళ్లికి ముందు వేడుకల ఫొటోలను స్మృతి మంధాన డిలీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇన్‌స్టాలో అతడిని ఆమె అన్‌ఫాలో చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే అది అవాస్తవమని తేలింది. పలాశ్ను ఆమె ఫాలో అవుతున్నారు. స్మృతి తండ్రికి గుండెపోటు రావడంతో ఈ నెల 23న జరగాల్సిన పెళ్లి వాయిదా పడింది. పలాశ్ చాటింగ్ బయటపడటంతో పెళ్లి మొత్తానికే రద్దయిందంటూ SMలో ప్రచారం జరుగుతోంది.


