News January 31, 2025
విమాన ప్రమాదం.. 40 మృతదేహాలు వెలికితీత

వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ ఎయిర్‌పోర్టు వద్ద ఆర్మీ హెలికాప్టర్ ఢీకొన్న ఘటనలో విమానంలో ఉన్న మొత్తం 67 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఇప్పటివరకు 40 మృతదేహాలు వెలికితీశారు. వీరిలో ఆర్మీ హెలికాప్టర్ సైనికుడి మృతదేహం కూడా ఉంది. మృతుల్లో అమెరికన్లతోపాటు కొందరు రష్యన్లు కూడా ఉన్నారు. పోటోమాక్ రివర్‌లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ సహాయకచర్యలు కొనసాగిస్తున్నాయి.
Similar News
News February 18, 2025
వరంగల్ నగరానికి 100 ఎలక్ట్రిక్ బస్సులు: టీకే శ్రీదేవి

వరంగల్ నగరానికి 100 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నివేదిక సమర్పించాలని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టరేట్ డాక్టర్ టీకే శ్రీదేవి ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ‘పీఎం ఈ-బస్ సేవా పథకం’లో భాగంగా వరంగల్ నగరానికి జనాభా ప్రాతిపదికన 100 ఎలక్ట్రిక్ బస్సులను నిర్వహణ కోసం బల్దియాకు అందజేయనున్నట్లు తెలిపారు.
News February 18, 2025
భారత్-పాక్ సరిహద్దుల్లో టెన్షన్

భారత్-పాక్ సరిహద్దుల్లోని పీర్‌పంజల్ ప్రాంతంలో(J&K) నియంత్రణ రేఖ(LOC) వెంబడి టెన్షన్ వాతావరణం నెలకొంది. పాక్‌కు చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్(BAT) కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించడమే దీనిక్కారణం. సరిహద్దు ఆవలి నుంచి కాల్పులు జరుపుతూ భారత బలగాల్ని రెచ్చగొట్టేందుకు పాక్ యత్నిస్తోంది. మరోవైపు.. సీజ్‌ఫైర్ ఉల్లంఘన జరగలేదని, అధికారికంగా అమల్లోనే ఉందని భారత్ చెబుతుండటం ఆసక్తికరంగా మారింది.
News February 18, 2025
నేటి నుంచి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు

ఎల్‌నినో, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిన కారణంగా ఈసారి ఎండాకాలం ముందే వచ్చేసిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి పగటి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు ఉంటాయని, అనేక ప్రాంతాల్లో 38డిగ్రీలు నమోదవుతాయంటున్నారు. ఇక APలో సాధారణం కంటే 2-4డిగ్రీలు గరిష్ఠంగా ఉంటాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. విజయనగరం, అనకాపల్లి, విశాఖ, విజయవాడ, గుంటూరు, రాయలసీమ జిల్లాలపై ప్రభావం ఎక్కువని అంచనా.