News February 7, 2025
అమెరికాలో విమానం మిస్సింగ్

అమెరికాలో విమానం అదృశ్యమైంది. 10 మందితో అలస్కా మీదుగా ప్రయాణిస్తున్న ఫ్లైట్ రాడార్ సిగ్నల్స్‌కు అందకుండా పోయింది. దీంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఇటీవల వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ ఎయిర్‌పోర్టు వద్ద ఆర్మీ హెలికాప్టర్ ఢీకొట్టడంతో విమానం పోటోమాక్ నదిలో కుప్పకూలింది. ఈ ఘటనలో మొత్తం 67 మంది ప్రయాణికులు మృతి చెందారు.
Similar News
News July 8, 2025
మల్టీపర్పస్ వర్కర్ల జీతాలకు నిధులు విడుదల

TG: గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి మూడు నెలల పెండింగ్ జీతాలు రూ.150 కోట్లు ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఇవాళ గ్రామ పంచాయతీల ఖాతాల్లో ఈ నిధుల జమ కానుండగా, ఒకట్రెండు రోజుల్లో 53 వేల మంది మల్టీ పర్పస్ వర్కర్లు తమ జీతాలు అందుకోనున్నారు.
News July 8, 2025
యాప్స్‌లో మోసం.. నాలుగింతలు వసూలు!

రైడ్ పూలింగ్ యాప్స్‌ల దోపిడీపై ఓ మహిళ చేసిన ట్వీట్ వైరలవుతోంది. బెంగళూరుకు చెందిన మహిళ 2.6kms వెళ్లేందుకు ఆటో బుక్ చేయగా రూ.172.45 చూపించింది. అదే దూరానికి డైరెక్ట్‌గా ఆటోలో వెళ్తే రూ.39 ఛార్జీని తీసుకున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. దీంతో యాప్స్‌లో జరుగుతున్న మోసాలపై చర్చ మొదలైంది. Ola, Rapido, Uber వంటి యాప్స్‌లో స్కామ్స్ జరుగుతున్నాయని, తామూ ఈ వ్యత్యాసాన్ని గమనించినట్లు పలువురు చెబుతున్నారు.
News July 8, 2025
ఆ రికార్డు ఇప్పటికీ గంగూలీ పేరు మీదే..

సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ రూపురేఖలు మార్చారు. టీమ్ ఇండియాకు తన ‘దాదా’గిరితో దూకుడు నేర్పించారు. సెహ్వాగ్, యువరాజ్, ధోనీ వంటి ప్లేయర్లు గంగూలీ హయాంలోనే ఎంట్రీ ఇచ్చారు. అంతర్జాతీయ కెరీర్‌లో 424 మ్యాచులు ఆడిన దాదా 18,575 పరుగులు చేశారు. వీటిలో 38 సెంచరీలు ఉన్నాయి. 1997లో వన్డేల్లో వరుసగా నాలుగు POTM అవార్డులు అందుకోగా ఆ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు.
ఇవాళ గంగూలీ పుట్టినరోజు.