News April 14, 2025

అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు యోచన

image

AP: అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విజయవాడ ఇబ్రహీంపట్నం వద్ద పెదలంక, చినలంకలో భూములను మంత్రి నారాయణ, MLAలు, కలెక్టర్ పరిశీలించారు. అంతర్జాతీయ క్రీడలు నిర్వహించేలా ఈ స్పోర్ట్స్ సిటీ ఉండాలని CM చెప్పారని మంత్రి వెల్లడించారు. ఇందుకోసం 2 వేల ఎకరాల అవసరం ఉంటుందని, లంక భూముల్లో సాధ్యాసాధ్యాలపై కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. నివేదిక ఆధారంగా ముందుకెళ్తామన్నారు.

Similar News

News April 21, 2025

కాసేపట్లో పిడుగులతో కూడిన వర్షం

image

TG: రాబోయే రెండు గంటల్లో హైదరాబాద్, ఆసిఫాబాద్, మెదక్, మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.

News April 21, 2025

భారతీయుల పట్ల పోప్‌కు ఉన్న ఆప్యాయతను మరచిపోం: పీఎం మోదీ

image

పోప్ ఫ్రాన్సిస్ మృ‌తి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. భారతీయుల పట్ల పోప్‌కు ఉన్న ఆప్యాయతను ఎన్నటికీ మరచిపోమని అన్నారు. ‘పోప్ ఫ్రాన్సిస్ మృతి చాలా బాధను కలిగించింది. ఈ కష్ట సమయంలో ప్రపంచ కాథలిక్ వర్గానికి నా ప్రగాఢ సంతాపం. జాలి, దయ, వినయం వంటి సుగుణాలకు ఓ ప్రతీకగా కోట్లాదిమంది హృదయాల్లో ఫ్రాన్సిస్ ఎప్పటికీ నిలిచి ఉంటారు’ అని పేర్కొన్నారు.

News April 21, 2025

ఇండియాలో 83% పన్నీర్ కల్తీనే.. ఇలా చెక్ చేయండి!

image

శాకాహార ప్రియులకు ఎంతో ఇష్టమైన ‘పన్నీర్’ ఇప్పుడు భారతదేశంలో అత్యంత కల్తీ ఆహార ఉత్పత్తిగా మారింది. ప్రస్తుతం 83% పన్నీర్ కల్తీ అని, అందులో 40శాతం వాటిని ఏ జంతువు తినకూడదని తాజా నివేదికలో వెల్లడైంది. ఈ క్రమంలో కల్తీ పన్నీర్‌ను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. ఉడకబెట్టిన పన్నీర్‌పై రెండు చుక్కల అయోడిన్ డ్రాప్స్ వేయాలి. నీలి రంగులోకి మారితే అది ఫేక్. ఒరిజినల్‌ది తెలుపు లేదా లైట్ ఆరెంజ్‌లోకి మారుతుంది.

error: Content is protected !!