News November 25, 2024

PLEASE CHECK.. ఈ లిస్టులో మీ పేరు ఉందా?

image

APలో ఉమ్మడి తూ.గో-ప.గో, గుంటూరు-కృష్ణా జిల్లాల్లో గ్రాడ్యుయేట్ MLC, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ, తూ.గో-ప.గో జిల్లాల టీచర్స్ MLC ఎన్నికల డ్రాఫ్ట్ రోల్స్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అన్ని పత్రాలు సమర్పించిన వారి పేర్లను లిస్టులో ఉంచారు. మీ నియోజకవర్గం ఎంపిక చేసుకుని, జిల్లా, పోలింగ్ బూత్ వివరాల ద్వారా మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. మీ పేరు తెలుసుకునేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News February 16, 2026

ఉపవాసం విరమించే ముందు..

image

ఉపవాసాన్ని విరమించే ముందు ఇంట్లో శివునికి నైవేద్యం సమర్పించాలి. అలాగే దీపారాధన కూడా చేయాలి. వీలైతే పేదలకు, బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. అన్నదానం తర్వాత ఉపవాసం విరమిస్తే వచ్చే పుణ్యం అనంతం. పారణ చేసేటప్పుడు ‘ఓం నమః శివాయ’ మంత్రం జపించాలని పండితులు సూచిస్తున్నారు. భగవంతునిపై మనసు లగ్నం చేసిన తర్వాత పాటించే ఈ పరిహారాలు అనంత పుణ్యాన్ని ఇస్తుంది. అందుకే విరమణ తర్వాత కూడా ప్రశాంతంగా, భక్తితో ఉండాలి.

News February 16, 2026

ఇంటర్వ్యూతో CDRIలో ఉద్యోగాలు

image

CSIR-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (C<>DRI)<<>>లో 12 ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ(సైన్స్), సంబంధిత విభాగంలో MSc, ఎంఫార్మసీ, NET, GATE అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cdri.res.in

News February 16, 2026

ఇంత దానికేనా అంత డ్రామా!

image

T20 WCలో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచులో వార్ వన్ సైడ్ అయింది. టీమ్ ఇండియాకు కనీస పోటీ కూడా ఇవ్వలేక దాయాది తేలిపోయింది. దీంతో టోర్నీకి ముందుకు పాక్ ‘బాయ్‌కాట్’ డ్రామా ఆడింది ఇందుకేనా అంటూ భారత ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటిదేదో జరుగుతుందని ఊహించి ఇండియాతో ఆడబోమంటూ తప్పించుకునే ప్రయత్నం చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. టోర్నీలో USA లాంటి చిన్న జట్లు మంచి పోటీ ఇచ్చాయని గుర్తు చేస్తున్నారు.