News December 4, 2024
దయచేసి అఫ్గాన్ ఆడపిల్లల చదువును అడ్డుకోకండి: రషీద్ ఖాన్
అఫ్గానిస్థాన్‌లో ఆడపిల్లల చదువును అడ్డుకోవద్దని తాలిబాన్ ప్రభుత్వాన్ని రషీద్ ఖాన్ ట్విటర్లో కోరారు. ‘మన మాతృభూమి ఇప్పుడు ఓ కీలక సమయంలో ఉంది. ప్రతి రంగంలోనూ మనకి నిపుణులు అవసరం. మహిళా వైద్యులు, సిబ్బంది లేకపోవడం చాలా బాధాకరం. మన తల్లులు, సోదరీమణుల కోసమైనా వైద్యరంగంలో మహిళల అవసరం ఉంది. మహిళల విద్య విషయంలో పునరాలోచించమని కోరుతున్నా’ అని పోస్ట్ చేశారు.
Similar News
News January 18, 2025
బుల్లి రాజు మరో మాస్టర్ భరత్ అవుతాడా?
సినిమాల్లో మాస్టర్ భరత్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా శ్రీనువైట్ల సినిమాల్లో భరత్ చేసిన కామెడీ సూపర్. ఇప్పటికీ ఆ సీన్లు మీమ్స్ రూపంలో SMలో దర్శనమిస్తాయి. ఇటీవల వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో బుడ్డోడు బుల్లిరాజు(రేవంత్) టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. చిన్నోడి కామెడీకి అభిమానులు ఫిదా అయ్యారు. రాబోయే రోజుల్లో భరత్ స్థానాన్ని ఈ చిన్నోడు భర్తీ చేస్తాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
News January 18, 2025
ఏపీలో ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్!
AP: కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ప్రైవేట్ ఎలక్ట్రిక్ వెహికల్ పార్కు ఏర్పాటు కానుంది. ఇందుకోసం పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ నిన్న మంత్రి లోకేశ్ సమక్షంలో ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రూ.1,800 కోట్ల పెట్టుబడితో 1,200 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. వచ్చే మార్చిలో శంకుస్థాపన చేయనున్నారు. తమ ఫ్యాక్టరీ నుంచి తొలి ఈవీ బైక్ 2026 డిసెంబర్ నాటికి విడుదలవుతుందని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
News January 18, 2025
త్వరలో 3,260 పోస్టుల భర్తీ!
TG: విద్యుత్ శాఖలో కొలువుల జాతర ప్రారంభం కానుంది. త్వరలోనే 3,260 పోస్టులు భర్తీ చేయాలని డిస్కమ్‌లు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్పీడీసీఎల్-వరంగల్‌లో 2,212 జేఎల్ఎం, 30 సబ్ ఇంజినీర్, 18 అసిస్టెంట్ ఇంజినీర్, ఎస్పీడీసీఎల్ లో 600 JLM, 300 సబ్ ఇంజినీర్, 100 AE పోస్టులను భర్తీ చేసే అవకాశముంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ ఖాళీలను భర్తీ చేయనుందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు.