News August 23, 2024

పోలాండ్ కబడ్డీ ఆటగాళ్లతో పీఎం భేటీ

image

పోలాండ్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, అక్కడి కబడ్డీ స్టార్స్‌తో తాజాగా భేటీ అయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఆయన తెలిపారు. ‘వార్సాలో పోలాండ్ కబడ్డీ ఆటగాళ్లు మికల్ స్పిజ్కో, అన్నా కల్బర్క్‌జిక్‌లను కలిశాను. ఆ ఆటను ఇక్కడి వారు చాలా ఇష్టపడుతుంటారు. పోలాండ్‌లో దాన్ని మరింతగా విస్తృతపరచడంపై, భారత్‌తో మరిన్ని టోర్నీలు ఆడటంపై వారితో చర్చించాను’ అని పీఎం వెల్లడించారు.

Similar News

News April 2, 2026

అభిషేక్ శర్మ ఔటా? నాటౌటా?

image

IPL: KKRతో మ్యాచులో అభిషేక్ శర్మ (48) క్యాచ్ చర్చనీయాంశంగా మారింది. ముజరబాని వేసిన బంతిని అభిషేక్ షాట్ ఆడగా బౌండరీ దగ్గర వరుణ్ చక్రవర్తి అందుకున్నారు. అయితే క్యాచ్ పట్టడానికి ముందు బాల్ నేలను తాకిందని పలువురు నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. తొలి మ్యాచులో క్లాసెన్ ఔట్ సైతం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మరి అభిషేక్ ఔటా? నాటౌటా? కామెంట్ చేయండి.

News April 2, 2026

ఒరాకిల్‌లో వారి ఉద్యోగాలే పోయాయా?

image

ఒరాకిల్‌ లేఆఫ్స్‌పై ఓ మాజీ ఉద్యోగిని చేసిన లింక్డిన్ పోస్ట్ ఐటీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 34 ఏళ్లుగా కంపెనీలో పనిచేస్తున్న నీనా లూయిస్ 30 వేల మందిని తొలగించడంపై షాకింగ్ ఆరోపణ చేశారు. ఈ తొలగింపులు యాదృచ్ఛికంగా జరగలేదని.. ఒక ‘అల్గారిథమ్’ ఉందని ఆరోపించారు. ముఖ్యంగా కంపెనీలో ఎక్కువ స్టాక్ ఆప్షన్స్ ఉండి, అధిక జీతం తీసుకునే సీనియర్స్‌ను, మిడ్-లెవల్ మేనేజర్లనే టార్గెట్ చేసినట్లు తెలిపారు.

News April 2, 2026

మీ రుణం తీర్చుకోలేం: అమరావతి మహిళలు

image

AP: అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును పార్లమెంటు ఆమోదించడంతో ఏపీలో సంబరాలు అంబరాన్నంటాయి. ఉద్ధండరాయునిపాలెం సభలో CBN, ఆయన సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు. CBN ప్రసంగం సహా సభ అంతా ఉద్వేగభరితంగా సాగింది. ముఖ్యంగా సుదీర్ఘ పోరాటం చేసిన మహిళలు సభ అనంతరం CM దంపతులకు భావోద్వేగంతో ధన్యవాదాలు తెలిపారు. ‘ఈ జన్మకు ఇది చాలు సార్. మా బతుకులు నిలబెట్టారు. ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేం’ అని అన్నారు.