News February 22, 2025

CM రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్

image

TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. SLBC టన్నెల్ ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలా సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కాగా ఇప్పటికే NDRF, SDRF బృందాలు అక్కడికి చేరుకున్నాయి.

Similar News

News December 22, 2025

స్వయంకృషి: Tutor.. టైమ్, మ్యాటర్ ఉంటే చాలు

image

పిల్లలకు ట్యూషన్ చెబుతూ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయి రేంజ్ ఆదాయం పొందొచ్చు తెలుసా. కావాల్సింది సబ్జెక్టుపై పట్టు, వివరించగల సామర్థ్యంతో పాటు సమయం. ఆఫ్‌లైన్, ఆన్లైన్లోనూ చెప్పొచ్చు. నగరాల్లో ఇంటికి పిలిపించి మరీ పిల్లలకు ట్యూషన్స్ పెట్టించేందుకు చాలామంది పేరంట్స్ రెడీగా ఉన్నారు. ఏదైనా పని చేస్తూ అదనపు ఆదాయంగా లేదా ఇదే పనిగా ఎంచుకొని ప్లానింగ్‌తో కెరీర్‌గా మార్చుకోవచ్చు.
-డైలీ 1pmకు ఓ బిజినెస్ ఐడియా

News December 22, 2025

స్నానం చేయకుండా వంటింట్లోకి వెళ్లవచ్చా?

image

వంటిల్లును మనం అన్నపూర్ణా దేవి నిలయంగా భావిస్తాం. అందుకే ఇల్లాలు స్నానమాచరించాకే వంట గదిలోకి ప్రవేశించాలని పెద్దలు చెబుతారు. మన శరీర శుద్ధి మనసుపై ప్రభావం చూపుతుంది. శుభ్రంగా ఉండి వండిన ఆహారం అమృతంతో సమానం. అది కుటుంబానికి ఆరోగ్యాన్ని, శక్తిని ఇస్తుంది. స్నానం చేయకుండా వంట చేస్తే ప్రతికూల శక్తి ప్రసరిస్తుంది. అనారోగ్యానికి కారణమవ్వొచ్చు. ఈ నియమాలతో లక్ష్మీ కటాక్షం, ప్రశాంతత చేకూరుతాయని నమ్మకం.

News December 22, 2025

54 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

<>దామోదర్ <<>>వ్యాలీ కార్పొరేషన్ 54 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఈ/ బీటెక్ అర్హతగల అభ్యర్థులు రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు . గేట్ 2025 స్కోరు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.56,100-రూ.1,77,500 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.300. వెబ్‌సైట్: https://www.dvc.gov.in