News February 22, 2025

CM రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్

image

TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. SLBC టన్నెల్ ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలా సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కాగా ఇప్పటికే NDRF, SDRF బృందాలు అక్కడికి చేరుకున్నాయి.

Similar News

News March 21, 2025

ఉల్లిపాయ తింటే కలిగే ప్రయోజనాలివే..!

image

ఉల్లిపాయ తినటం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. తద్వార వడదెబ్బ తాకే ప్రమాదాన్ని నివారించవచ్చు. ఇందులో ఉండే అధిక నీటిశాతం, ఖనిజాల వల్ల డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అధిక శాతం ఫైబర్ ఉంటుంది తద్వార జీర్ణశక్తి పెరుగుతుంది. సల్ఫర్, పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహకరిస్తాయి. ఇవి తినటం వల్ల చర్మం, జుట్టుకు సైతం ఎంతో మేలు.

News March 21, 2025

SLBC టన్నెల్ ప్రమాదంపై అధికారుల సమీక్ష

image

SLBC టన్నెల్ లో జరుగుతున్న సహాయక చర్యలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. పనులను వేగవంతం చేసేందుకు అన్ని విభాగాలను సమన్వయం చేస్తున్నట్లు తెలిపారు. భద్రతా ప్రమాణాలను పాటిస్తూనే సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 22న టన్నెల్ ప్రమాదం జరగగా 8మంది కార్మికులు టన్నెల్‌లో చిక్కుకున్నారు. వీరిలో ఒక ఇంజినీర్ మృతదేహం లభించింది.

News March 21, 2025

కర్ణాటకలో మంత్రులు సహా 48మంది నేతలపై ‘హనీ ట్రాప్’!

image

కర్ణాటకలో మంత్రులు సహా 48మంది ‘హనీ ట్రాప్’లో చిక్కుకున్నారంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాజకీయ ప్రయోజనాలకోసం విసిరిన వలపు వలల్లో జాతీయ స్థాయి నేతలు సైతం చిక్కుకున్నారని అసెంబ్లీలో మంత్రి కేఎన్ రాజన్న వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేయించాలని అటు అధికార, ఇటు విపక్ష నేతలు డిమాండ్ చేయడంతో దర్యాప్తు చేయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

error: Content is protected !!