News November 17, 2024
కొత్త చిత్రంపై ప్రధాని మోదీ ప్రశంసలు
2002లో జరిగిన గోద్రా రైలు దుర్ఘటనకు దారితీసిన పరిణామాల కథాంశంగా తెరకెక్కిన ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ ఘటన చుట్టూ ఏర్పడిన వివాదాన్ని కొట్టిపారేస్తూ చిత్రంలో నిజాలను వెల్లడించినందుకు అభినందించారు. నకిలీ కథనాలు తక్కువకాలం మాత్రమే మనుగడ సాధించగలవని వ్యాఖ్యానించారు. సామాన్యులు సైతం చూడదగిన పద్ధతిలో నిజాలు బయటకు రావడం శుభపరిణామమని పేర్కొన్నారు.
Similar News
News November 17, 2024
BGT: తొలి టెస్టుకు కెప్టెన్ ఎవరంటే?
ఆస్ట్రేలియాతో జరిగే BGTలో తొలి టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులో ఉండరని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఆయన స్థానంలో బుమ్రా భారత కెప్టెన్గా వ్యవహరిస్తారని తెలిపాయి. ఇటీవల రోహిత్ భార్య కుమారుడికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కుటుంబంతోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే హిట్ మ్యాన్ రెండో టెస్టుకు జట్టుకు అందుబాటులో ఉంటారన్నాయి. మరోవైపు గాయపడిన కేఎల్ రాహుల్ కోలుకున్నట్లు సమాచారం.
News November 17, 2024
తొలి రోజు ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-3 పరీక్ష
TG: గ్రూప్-3 పరీక్ష తొలి రోజు ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ పేపర్-1, పేపర్-2 పరీక్ష జరగగా రేపు ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-3 పరీక్ష జరగనుంది. కాగా నిమిషం నిబంధన కారణంగా పలువురు అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అధికారులు అనుమతించలేదు.
News November 17, 2024
BGT: నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం?
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేస్తారని తెలుస్తోంది. ఇన్నింగ్స్ చివర్లో మెరుపులు మెరిపించగల సత్తా ఉండటంతో మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో ఆయనను తుది జట్టులో ఆడిస్తారని వార్తలు వస్తున్నాయి. నితీశ్తోపాటు దేవదత్ పడిక్కల్ లేదా సాయి సుదర్శన్లలో ఒకరు డెబ్యూ చేస్తారని టాక్.