News November 8, 2024

రేవంత్‌కు ప్రధాని మోదీ విషెస్

image

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరోగ్యవంతమైన జీవితం లభించాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. దీంతో ప్రధానికి సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. ‘ఇందిరమ్మ రాజ్యంతో ఇంటింటా వెలుగు నింపడానికి నిర్విరామ కృషి చేస్తున్న ప్రజా నాయకుడు రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు’ అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ట్వీట్ చేశారు.

Similar News

News December 3, 2025

ALERT.. అతి భారీ వర్షాలు

image

AP: రాబోయే 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడతాయని IMD అంచనా వేసింది. రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.

News December 3, 2025

ఏపీ టెట్ హాల్‌టికెట్లు విడుదల

image

ఈ నెల 10 నుంచి జరగనున్న ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక <>వెబ్‌సైట్లోకి<<>> వెళ్లి తమ వివరాలు ఎంటర్ చేసి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈసారి టెట్‌కు 2,41,509 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. రెండు విడతల్లో పరీక్షలు జరగనుండగా ఫస్ట్ సెషన్ ఉ.9.30 గంటల నుంచి మ.12 గంటల వరకు నిర్వహిస్తారు. సెకండ్ సెషన్ మ.2.30 గంటల నుంచి సా.5 గంటల వరకు జరుగుతుంది.

News December 3, 2025

క్విక్-C-వార్: మర్చిపోయారా..! మరేం పర్లేదు!!

image

క్విక్ కామర్స్ కంపెనీల పోటీ యుద్ధంతో కస్టమర్లకు మరో కొత్త బెనిఫిట్ రాబోతోంది. Blinkit ‘యాడ్ ఐటమ్స్ ఆఫ్టర్ ఆర్డరింగ్’ ఫీచర్ తీసుకొచ్చింది. దీంతో వస్తువులు ఆర్డర్ చేశాక అది ప్యాకింగ్ స్టేజ్‌లో ఉంటే మరికొన్ని యాడ్ చేయొచ్చు. క్విక్ మార్కెట్ వాటా పెంచుకునేందుకు ఇప్పటికే జెప్టో ప్రాసెసింగ్, డెలివరీ ఛార్జెస్ తొలగించింది. స్విగ్గీ మ్యాక్స్ సేవర్, ప్రైస్ డ్రాప్ వంటి ఆఫర్స్ తీసుకొచ్చింది.