News November 8, 2024
రేవంత్‌కు ప్రధాని మోదీ విషెస్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరోగ్యవంతమైన జీవితం లభించాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. దీంతో ప్రధానికి సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. ‘ఇందిరమ్మ రాజ్యంతో ఇంటింటా వెలుగు నింపడానికి నిర్విరామ కృషి చేస్తున్న ప్రజా నాయకుడు రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు’ అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ట్వీట్ చేశారు.
Similar News
News December 8, 2024
కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్‌లో సమస్య ఉంది: మంజ్రేకర్
విరాట్ కోహ్లీ అడిలైడ్ టెస్టులో 2 ఇన్నింగ్స్‌లలోనూ తక్కువ స్కోరుకే ఔటయ్యారు. ఆయన ఆడుతున్న విధానంలో లోపం ఉందని కామెంటేటర్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ఆఫ్‌స్టంప్ ఆవల స్వింగ్ అయ్యే బాల్‌ను ఆడేందుకు కోహ్లీ కొత్త టెక్నిక్ ఎంచుకున్నారని, అది సత్ఫలితాలను ఇవ్వడంలేదని పేర్కొన్నారు. మరోవైపు క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విరాట్‌కు మద్దతుగా నిలిచారు. ఇదే టెక్నిక్‌తో కోహ్లీ 9వేల పరుగులు చేశారని గుర్తుచేశారు.
News December 8, 2024
ఇంటింటి కులగణన సర్వే పూర్తి
TG: రాష్ట్ర ప్రభుత్వం గత నెల 6న చేపట్టిన సమగ్ర ఇంటింటి కులగణన సర్వే పూర్తయింది. GHMC మినహా అన్ని జిల్లాల్లో 100% సర్వే పూర్తయినట్లు అధికారులు తెలిపారు. సర్వేలో సేకరించిన సమాచారాన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో భద్రపరుస్తున్నారు. మరో 4, 5 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. కాగా కులగణన సర్వేకు సంబంధించిన సమాచారాన్ని ఎవరికీ ఇవ్వవద్దని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.
News December 8, 2024
BREAKING: రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
AP: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని పిడుగురాళ్ల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్ద కొత్త కారుకు పూజ చేసుకుని తిరిగొస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.