News December 12, 2024

గుకేశ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

image

ప్రపంచ చెస్ ఛాంఫియన్‌గా నిలిచిన దొమ్మరాజు గుకేశ్(18)ను ప్రధాని మోదీ అభినందించారు. ఆయన విజయం చరిత్రాత్మకం, ఆదర్శవంతమని కొనియాడారు. గుకేశ్ అసాధారణ ప్రతిభ, కృషి, సంకల్పానికి ఈ ఫలితమే నిదర్శనమని చెప్పారు. అటు గుకేశ్ దేశాన్ని గర్వపడేలా చేశారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మెచ్చుకున్నారు. కాగా ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన మొదటి భారతీయుడిగా విశ్వనాథన్ ఆనంద్ నిలవగా, రెండో వ్యక్తిగా గుకేశ్ నిలిచారు.

Similar News

News December 12, 2024

ALERT.. ఈ జిల్లాల్లో చలిగాలులు

image

తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కంటే 2-4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో చలిగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది.

News December 12, 2024

డిసెంబర్ 29న కొమురవెల్లి మల్లన్న కళ్యాణం

image

TG: డిసెంబర్ 29న కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం నిర్వహించనున్నట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. మల్లన్న కళ్యాణం, జాతరపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జనవరి 19 నుంచి మార్చి 24 వరకు జరిగే జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. రూ.46 కోట్లతో జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. అటు త్వరలో CM రేవంత్‌ను కలిసి స్వామి కళ్యాణోత్సవానికి ఆహ్వానించనున్నట్లు ఆమె తెలిపారు.

News December 12, 2024

అర్ధ సంవత్సర పాలన అర్థ రహితం: షర్మిల

image

AP: కూటమి ప్రభుత్వం అర్ధ సంవత్సర పాలన అర్థ రహితమని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల దుయ్యబట్టారు. ఆరు నెలల పాలనలో సూపర్ 6 హామీల అమలుకు దిక్కులేదని విమర్శించారు. టీడీపీ తొలి ఐదేళ్ల పాలనలో అరచేతిలో వైకుంఠం చూపిస్తే, ఇప్పుడు అదే చేతిలో కైలాసం చూపిస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి హనీమూన్ ముగిసిందని, ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.