News November 13, 2024
ప్రధాని ఒక జడ్జిలా ఉండాలి: CM రేవంత్

TG: దేశ ప్రధాని ఒక జడ్జిలా ఉండాలని CM రేవంత్ అన్నారు. ఆటలో రిఫరీ ఒక జట్టు తరఫున ఆడకూడదని, ఒకరి తరఫున వకాల్తా పుచ్చుకోవద్దని, ఇలాంటి పరిణామాలు దేశానికి మంచిది కాదని అన్నారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను ప్రధాని మోదీ విస్మరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారిని గుజరాత్‌కు మళ్లిస్తున్నారని, అందుకు సెమీకండక్టర్ పరిశ్రమ ఉదాహరణ అన్నారు.
Similar News
News January 8, 2026
పేద బ్రాహ్మణుల కోసం ‘గరుడ’ పథకం

AP: పేద బ్రాహ్మణుల కోసం ‘గరుడ’ పేరుతో కొత్త పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. బ్రాహ్మణులు చనిపోతే ఆ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఈ స్కీమ్‌తో కష్ట సమయంలో వారికి ఉపశమనం కలుగుతుందని చెప్పారు. దీనిపై ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించినట్లు తెలిపారు. అమరావతి సచివాలయంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చిరాంప్రసాద్‌తో సమావేశమై గరుడ పథకంపై చర్చించారు.
News January 8, 2026
స్పర్శిస్తూ కళను అనుభూతి చెందుతున్నారు!

కళను కళ్లతో చూడడమే కాదు చేతులతో తాకి అనుభూతి చెందవచ్చని నిరూపిస్తోంది జైపూర్‌లోని(RJ) ‘రాజస్థాన్ నేత్రహీన్ కళ్యాణ్ సంఘ్’. St+art ఫౌండేషన్ చేపట్టిన ‘స్పర్శ్’ ప్రాజెక్ట్ ద్వారా అంధ విద్యార్థుల కోసం గోడలపై ‘టాక్టైల్ ఆర్ట్’ను రూపొందించారు. బ్రెయిలీ లిపి, టెక్స్చర్డ్ పెయింట్స్‌తో తీర్చిదిద్దిన ఈ చిత్రాలను స్పర్శిస్తూ అంధ విద్యార్థులు రాజస్థాన్ సంస్కృతిని అనుభూతి చెందుతున్నారు.
News January 8, 2026
AP క్యాబినెట్ నిర్ణయాలు

* వైద్యుడు సుధాకర్ ఫ్యామిలీకి రూ.కోటి సహాయం. ఆయన కొడుకు సి.కె.లలిత్ ప్రసాద్‌కు స్పెషల్ ప్రమోషన్ కింద డిప్యూటీ తహశీల్దార్‌గా పదోన్నతి
* పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్
* పాఠశాల కిట్ల పంపిణీకి రూ.944.53కోట్లకు పరిపాలన అనుమతులు
* ఏపీ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం
* 39.52 లక్షల విద్యార్థులకు పెండింగ్‌లో పెట్టిన సొమ్ము చెల్లింపునకు ఆమోదం


