News November 13, 2024
ప్రధాని ఒక జడ్జిలా ఉండాలి: CM రేవంత్

TG: దేశ ప్రధాని ఒక జడ్జిలా ఉండాలని CM రేవంత్ అన్నారు. ఆటలో రిఫరీ ఒక జట్టు తరఫున ఆడకూడదని, ఒకరి తరఫున వకాల్తా పుచ్చుకోవద్దని, ఇలాంటి పరిణామాలు దేశానికి మంచిది కాదని అన్నారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను ప్రధాని మోదీ విస్మరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారిని గుజరాత్‌కు మళ్లిస్తున్నారని, అందుకు సెమీకండక్టర్ పరిశ్రమ ఉదాహరణ అన్నారు.
Similar News
News April 18, 2026
హిట్ అండ్ రన్ కేసులో లొంగిపోయిన మాజీ MLA కొడుకు

TGలో 2022లో కలకలం రేపిన BRS మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పటి నుంచి పరారీలో ఉన్న రాహిల్ కోర్టు ఆదేశాలతో మూడేళ్ల తర్వాత తాజాగా పోలీసుల ఎదుట లొంగిపోయారు. 2022 మార్చి 18న జూబ్లీహిల్స్‌లో రోడ్డు దాటుతున్న కొందరిని MLA స్టిక్కర్ ఉన్న కారు ఢీకొట్టింది. ఇందులో 2 నెలల బాలుడు చనిపోగా, ముగ్గురు మహిళలు గాయపడ్డారు. ఈ కేసులో రాహిల్ నిందితుడిగా ఉన్నారు.
News April 18, 2026
రేపే ఎగ్జామ్.. సీటొస్తే ఫ్యూచర్ సెట్

TGలోని 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతి, 7-10 తరగతుల్లో ఖాళీ సీట్ల ప్రవేశాలకు రేపు పరీక్ష జరగనుంది. ఆరో తరగతిలో ప్రవేశానికి 23వేలకు పైగా, మిగతా క్లాసులకు 37వేల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలో మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఇంగ్లిష్ మీడియంలో బోధన, బాలికలకు భోజనం, హాస్టల్ సదుపాయం ఉంటుంది. IIT, JEE, నీట్, ఎంసెట్, CA, TPT తదితర పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు.
News April 18, 2026
‘హార్ముజ్’ ఓపెన్.. ఇరాన్ 3 షరతులివే!

‘హార్ముజ్’ను ఓపెన్ చేసిన నేపథ్యంలో ఇరాన్ 3 కండిషన్స్ పెట్టినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.
☛ జలసంధి గుండా కమర్షియల్ నౌకలకే అనుమతి ఉంటుంది. మిలిటరీ నౌకలకు ప్రవేశం లేదు.
☛ ఇరాన్ నిర్దేశించిన మార్గంలోనే షిప్స్ వెళ్లాలి.
☛ ఇరాన్ మిలిటరీతో కోఆర్డినేట్ చేసుకున్న తర్వాతే రాకపోకలు జరగాలి.


