News November 27, 2024
భారత్‌పై ప్రధానికి ఉన్న ప్రేమ స్ఫూర్తిదాయకం: పవన్ కళ్యాణ్
AP: తనను కలిసేందుకు సమయం కేటాయించినందుకు PM మోదీకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ట్విటర్లో కృతజ్ఞతలు తెలిపారు. ‘పార్లమెంట్ సెషన్లతో బిజీగా ఉన్నా నాకు సమయం కేటాయించిన ప్రధానికి కృతజ్ఞతలు. గాంధీనగర్‌లో తొలిసారి భేటీ నుంచి ఇప్పటి వరకు కలిసిన ప్రతిసారీ ఆయనపై అభిమానం మరింత పెరుగుతుంటుంది. భారత్ పట్ల ఆయనకున్న ప్రేమ, నిబద్ధత స్ఫూర్తిదాయకం. థాంక్యూ సర్’ అని పేర్కొన్నారు.
Similar News
News November 27, 2024
‘కూల్చివేత మనిషి’ అంటూ BJP సెటైర్లు
TG: సీఎం రేవంత్ కూల్చివేతల మనిషి(డెమోలిషన్ మ్యాన్) అంటూ తెలంగాణ BJP సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేసింది. ఆయన వెనుకబడిన, పేద, మధ్యతరగతి వర్గాల ఇళ్లను మాత్రమే కూల్చివేస్తాడని ఆరోపించింది. కాంగ్రెస్ ఉన్నతవర్గం, మిత్రపక్షం BRS, కామన్ ఫ్రెండ్ ఒవైసీ సోదరుల విశాలమైన అక్రమ నిర్మాణాలు, ఫామ్‌హౌస్‌లను తాకబోరంటూ విమర్శలు గుప్పించింది. హైడ్రా, మూసీ కూల్చివేతలను ఉద్దేశించి ఈ పోస్టు చేసింది.
News November 27, 2024
వీడియో లీక్.. స్పందించిన నటి
పాయల్ కపాడియా దర్శకత్వంలో తాను నటించిన ‘ఆల్ వి ఇమేజిన్ యూజ్ లైట్’ మూవీకి సంబంధించిన తన నగ్న సన్నివేశాలు సోషల్ మీడియాలో లీక్ కావడంపై మలయాళ నటి దివ్య ప్రభ స్పందించారు. ‘ఫేమ్, పాపులారిటీ కోసమే ఇలాంటి సీన్లలో నటించానని కొందరు అంటున్నారు. ఈ సినిమా కంటే ముందు నటించిన పలు చిత్రాలకు అవార్డులు అందుకున్నా. పేరు కోసం ఇలాంటి వాటిలో నటించాల్సిన అవసరం నాకు లేదు. కథలు నచ్చితే సినిమాలు చేస్తా’ అని ఆమె చెప్పారు.
News November 27, 2024
అప్పుడు YSR, KCR, ఇప్పుడు రేవంత్: కిషన్‌రెడ్డి
TG: పార్టీ ఫిరాయింపుల విషయంలో BRS, కాంగ్రెస్ ఒకటేనని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో అన్నారు. అప్పుడు YSR, KCR, ఇప్పుడు రేవంత్ పార్టీ ఫిరాయింపులు చేయిస్తున్నారన్నారు. ఫిరాయింపు MLAలపై నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పినా స్పీకర్ స్పందించడం లేదన్నారు. అటు ఫుడ్‌పాయిజన్‌తో ఓ చిన్నారి చనిపోతే CM రేవంత్ కనీసం దృష్టి పెట్టలేదని అన్నారు. 4-5 నెలలుగా విద్యార్థులు అవస్థలు పడుతున్నారని చెప్పుకొచ్చారు.