News August 2, 2024
PNB వడ్డీ రేట్లు స్వల్పంగా పెంపు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(MCLR)ను 5 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో వాహన, వ్యక్తిగత రుణాలపై ఏడాది కాలపరిమితికి వడ్డీరేటు 8.85 శాతం నుంచి 8.90 శాతానికి పెరగనుంది. 3 నెలల MCLR 8.50% to 8.55%కి, ఆరు నెలలకు 8.70% నుంచి 8.75%కు, మూడేళ్లకు 9.15% నుంచి 9.20%కు చేరుకుంటుంది.
Similar News
News November 18, 2025
ఇతరులకు ఇబ్బంది కలిగించకపోతేనే వాస్తు ఫలితాలు

మనం మన పరిధిలో, ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వాస్తును దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపట్టాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. కేవలం మన సౌకర్యమే కాక, సామాజిక ధర్మాన్ని కూడా పాటించడం ముఖ్యమంటున్నారు. ఇతరుల హక్కులకు భంగం కలగకుండా నిర్మాణాలు చేయడం వల్ల శాస్త్రరీత్యా, ధర్మబద్ధంగా అందరికీ శుభం, శ్రేయస్సు కలుగుతుందని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News November 17, 2025
గిగ్ వర్కర్ల బిల్లుకు క్యాబినెట్ ఆమోదం

TG: గిగ్, ప్లాట్ఫామ్ ఆధారిత వర్కర్లకు సామాజిక భద్రత, భరోసా కల్పించడానికి ఉద్దేశించిన బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఫుడ్ డెలివరీ, క్యాబ్ డ్రైవర్లు, ప్యాకేజీ డెలివరీల్లో పనిచేస్తున్న 4 లక్షల మంది ప్రయోజనం పొందే అవకాశం ఉంది. గిగ్ వర్కర్లు వివరాలను నమోదు చేసుకోవాలని మంత్రి వివేక్ సూచించారు. త్వరలో అసెంబ్లీలో గిగ్ వర్కర్ల బిల్లును ప్రవేశపెడతామని వెల్లడించారు.