News August 2, 2024

PNB వడ్డీ రేట్లు స్వల్పంగా పెంపు

image

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌-బేస్డ్‌ లెండింగ్‌ రేటు(MCLR)ను 5 బేసిస్‌ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో వాహన, వ్యక్తిగత రుణాలపై ఏడాది కాలపరిమితికి వడ్డీరేటు 8.85 శాతం నుంచి 8.90 శాతానికి పెరగనుంది. 3 నెలల MCLR 8.50% to 8.55%కి, ఆరు నెలలకు 8.70% నుంచి 8.75%కు, మూడేళ్లకు 9.15% నుంచి 9.20%కు చేరుకుంటుంది.

Similar News

News October 12, 2024

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీకి నవనీత్ కౌర్ దూరం!

image

బీజేపీ నేత నవనీత్ కౌర్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోదని భావిస్తున్నట్లు ఆమె భర్త రవి రాణా తెలిపారు. బీజేపీ అధిష్ఠానం ఆమెకు రాజ్యసభ సీటు ఇస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో అమరావతి నుంచి పోటీ చేసిన నవనీత్ కౌర్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. మరోవైపు వచ్చే నెల 26తో మహా అసెంబ్లీ గడువు ముగియనుంది. ఈ క్రమంలో త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశముంది.

News October 12, 2024

తెలుగు ప్రజలకు చంద్రబాబు విజయదశమి శుభాకాంక్షలు

image

తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా జరుపుకుంటామని తెలిపారు. దుష్ట సంహారం తర్వాత శాంతి, సౌభ్రాతృత్వంతో అందరూ కలసి మెలసి జీవించాలన్నదే ఈ పండుగ సందేశమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో శాంతియుత, అభివృద్ధికారక సమాజం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ప్రజలంతా చల్లగా చూడాలని దుర్గమ్మను ప్రార్థించానని చెప్పారు.

News October 12, 2024

20 నియోజకవర్గాల్లో అక్రమాలు: జైరాం రమేశ్

image

హ‌రియాణా ఎన్నిక‌ల ఫ‌లితాల విష‌యంలో తాము లేవ‌నెత్తిన అభ్యంత‌రాల‌పై EC విచార‌ణ జ‌రుపుతుంద‌ని భావిస్తున్న‌ట్టు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జైరాం ర‌మేశ్ పేర్కొన్నారు. కౌంటింగ్ సందర్భంగా 20 స్థానాల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని ఆయ‌న ఆరోపించారు. కౌంటింగ్‌కి ఉప‌యోగించిన EVMలు, వాటి బ్యాట‌రీ సామ‌ర్థ్యాల‌పై కాంగ్రెస్ అభ్య‌ర్థులు అభ్యంత‌రాలు లేవ‌నెత్తారని, అక్ర‌మాలు జ‌రిగిన EVMల‌ను సీల్ చేయాల్సిందిగా ఆయ‌న కోరారు.