News July 26, 2024

జగన్ వల్లే పోలవరం విధ్వంసం: మంత్రి నిమ్మల

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ వల్లే పోలవరం ప్రాజెక్టు విధ్వంసానికి గురైందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. శాసనమండలిలో పోలవరంపై ఆయన ప్రసంగించారు. ‘పోలవరం ఎత్తు తగ్గించి నిధులు మళ్లించుకోవాలని జగన్ కుట్ర పన్నారు. కాంటూర్ ఎత్తు తగ్గిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు ఎత్తు తగ్గించాలని చూశారు. కేంద్ర నిధులు దారి మళ్లించేందుకు ఆయన ప్రయత్నించారు’ అని మంత్రి మండిపడ్డారు.

Similar News

News October 6, 2024

నేడు లలితా త్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ

image

నేడు విజయవాడ కనక దుర్గమ్మ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమివ్వనుంది. త్రిపురత్రయంలో రెండో శక్తి స్వరూపిణి ఈ అమ్మవారు. తల్లిని కొలిస్తే కష్టాలు తొలిగి, ఐశ్వర్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. మాత అనుగ్రహం పొందేందుకు ‘ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రేనమ:’ అనే మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పించాలని పండితులు చెబుతున్నారు.

News October 6, 2024

తొలి టీ20 నెగ్గేదెవరో?

image

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు భారత్ సిద్ధమైంది. నేడు గ్వాలియర్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. సూర్య కుమార్ నాయకత్వంలోని కుర్రాళ్లు బంగ్లా జట్టుపై ఎలాంటి ప్రదర్శన చేస్తారో అని ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 14 టీ20లు జరగ్గా భారత్ 13 విజయాలు సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్ ఒక మ్యాచులో గెలుపొందింది. కాగా గ్వాలియర్‌లో 14 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ జరగనుండటం గమనార్హం.

News October 6, 2024

నేటి నుంచి బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లు

image

TG: నేటి నుంచి బీఎస్సీ నర్సింగ్ 2024-25 అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 14 వరకు ఆన్‌లైన్‌లో <>దరఖాస్తు<<>> చేసుకోవాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ సూచించింది. ఈఏపీసెట్-2024 క్వాలిఫై అయిన వారిని మాత్రమే అర్హులుగా పేర్కొంది. వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి, మెరిట్ జాబితాను రిలీజ్ చేస్తామని తెలిపింది.