News October 24, 2024
పోలీసుల్ని మర మనుషుల్లా చూస్తున్నారు: ప్రవీణ్ కుమార్
TG: రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా పడిపోయాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ‘పోలీసులను సీఎం రేవంత్ రెడ్డి మర మనుషుల్లా చూస్తున్నారు. నెలలో వరుసగా 26 రోజులు డ్యూటీ చేస్తే 4 రోజులు సెలవులు ఇస్తామనడం దారుణం. దీనిపై పోలీసుల కుటుంబాలు నల్గొండలో ఆందోళన చేస్తే విధుల్లో ఉన్న పోలీసుల్ని సస్పెండ్ చేశారు. పోలీసుల్లో అశాంతి నెలకొంది. అది ప్రమాదకరం’ అని అన్నారు.
Similar News
News November 3, 2024
ఝార్ఖండ్‌లో మహిళల ఓట్లే లక్ష్యం
ఝార్ఖండ్‌లో గెలుపు కోసం JMM, BJP కూటములు మహిళా ఓటర్లను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలోని 81 నియోజకవర్గాల్లో 32 స్థానాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. వీరి మెప్పు పొందేందుకు JMM ప్రభుత్వం ఇప్పటికే మహిళల ఖాతాల్లో నెలకు రూ.1000 సాయం ఇస్తోంది. మరోవైపు ప్రతి నెల మహిళలకు రూ.2,100 ఆర్థిక సాయం ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. మరి మహిళల ఓటు ఎటన్నది తేలాల్సి ఉంది.
News November 3, 2024
మధ్యంతర భృతి ప్రకటించాలని జేఏసీ వినతి
AP: ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించాలని AP JAC అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే 18 అంశాలను CM చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. హెల్త్ కార్డులు పని చేయడం లేదని, క్యాష్ లెస్ వైద్య సదుపాయం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు ₹25 వేల కోట్ల వరకు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. విశ్రాంత ఉద్యోగుల బకాయిలైనా చెల్లించాలని కోరారు.
News November 3, 2024
IPL.. RCB కెప్టెన్ కోహ్లీ కాదా?
RCB కెప్టెన్‌గా కోహ్లీ బాధ్యతలు చేపడతారనే ప్రచారం జరుగుతున్న వేళ ఆ జట్టు డైరెక్టర్ మొ బొబట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఫ్రాంచైజీ ఇంకా కెప్టెన్సీపై నిర్ణయం తీసుకోలేదు. మాకు ఇంకా ఆప్షన్లు ఉన్నాయి. మా పాత కెప్టెన్ డుప్లిసెస్‌ను మేం రిటైన్ చేసుకోలేదు. అతడు గతేడాది అద్భుతంగా జట్టును ముందుకు నడిపారు. వేలంలో ఓపెన్ మైండ్‌తో ఆలోచిస్తాం’ అని అన్నారు. దీంతో RCB కెప్టెన్ ఎవరనే దానిపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి.