News October 2, 2024
గోవిందా వివరణపై పోలీసుల అసంతృప్తి!
అనుకోకుండా తుపాకీతో <<14239558>>కాల్చుకోవడంపై<<>> బాలీవుడ్ నటుడు, శివసేన నేత గోవిందాను ముంబై పోలీసులు ప్రశ్నించారు. రివాల్వర్‌ను శుభ్రం చేస్తున్నప్పుడు అనుకోకుండా మిస్ ఫైర్ అయిందని ఆయన చెప్పగా ఆ వివరణతో పోలీసులు సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. పలు అనుమానాలు రావడంతో ఆయన కుమార్తెను సైతం విచారించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 6, 2024
జనసంద్రమైన మెరీనా బీచ్(PHOTOS)
చెన్నైలో ఎయిర్‌షోకు ప్రజలు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో లక్షలాది మంది ఎయిర్‌షోను చూసేందుకు తరలివచ్చారు. దీంతో మెరీనా బీచ్ అంతా జనసంద్రమైంది. బీచ్‌కు వచ్చే రోడ్లు, మెట్రో రైళ్లు ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయాయి. ఈక్రమంలోనే మెరీనా బీచ్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గాయపడ్డారు.
News October 6, 2024
పాక్‌పై మరోసారి ఆధిపత్యం చాటిన భారత్
భారత మహిళల క్రికెట్ జట్టు పాకిస్థాన్‌పై మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టీ20 వరల్డ్ కప్‌లో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టును ఓడించింది. ఇరు జట్లు ఇప్పటివరకు మెగా టోర్నీల్లో 8 సార్లు తలపడి భారత్ 6 సార్లు గెలవగా, పాక్ రెండు సార్లు మాత్రమే విజయం సాధించింది. ఇక ఓవరాల్‌గా దాయాదుల మధ్య 16 టీ20 మ్యాచులు జరగ్గా 13 భారత్, 3 పాక్ గెలిచింది.
News October 6, 2024
చెన్నైలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి
చెన్నై మెరీనా బీచ్‌లో ఎయిర్‌షో సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. ఎయిర్‌షో చూసేందుకు లక్షలాది మంది తరలిరావడంతో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరింత మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒకరు ఏపీకి చెందిన వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు. సుమారు 100 మంది స్థానిక ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నట్లు సమాచారం.