News May 24, 2024
YCP కాపలా కుక్కలుగా పోలీసులు: రామకృష్ణ

AP: ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో ఈసీ పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని, పోలీసులు వైసీపీ కాపలా కుక్కలుగా వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బదిలీ, సస్పెండ్ అయిన వెధవలు ఖాకీ డ్రెస్‌లు వేసుకోవడానికి సిగ్గులేదా? అని మండిపడ్డారు. ఈవీఎంను పగలగొట్టిన పిన్నెల్లిని పట్టుకోలేని అసమర్థులు పోలీసులు అని దుయ్యబట్టారు.
Similar News
News February 17, 2025
బీసీసీఐ షరతులతో ఇబ్బందిపడుతున్న కోహ్లీ!

బీసీసీఐ టీమ్ఇండియాకు పెట్టిన షరతులు కోహ్లీకి ఇబ్బందికరంగా మారాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ఫ్యామిలీ, వ్యక్తిగత సిబ్బందికి బోర్డ్ నో చెప్పింది. దీంతో కోహ్లీ తన చెఫ్‌ను వెంట తీసుకెళ్లలేకపోయారు. డైట్ విషయంలో చాలా కఠినంగా ఉండే విరాట్‌కి అక్కడి ఫుడ్ తినటం ఇబ్బందిగా మారిందట. దీంతో మేనేజర్‌తో తనకు కావాల్సిన ఆహారాన్ని ఓ ఫేమస్ ఫుడ్ పాయింట్ నుంచి తెప్పించుకొని తింటున్నారని సమాచారం.
News February 17, 2025
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం: CM రేవంత్

TG: ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. ఇసుక రీచ్‌లను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టం చేశారు. ఓవర్ లోడ్, అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేపట్టాలని, ప్రభుత్వ ఆదాయానికి అక్రమార్కులు గండికొట్టకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
News February 17, 2025
PAK Links: పాకిస్థానీపై FIR నమోదు

పాకిస్థాన్ పౌరుడు అలీ తాఖీర్ షేక్‌పై అస్సాంలో FIR నమోదైంది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ భార్య ఎలిజబెత్‌తో అతడు కాంటాక్టులో ఉన్నాడని సమాచారం. ఢిల్లీ అల్లర్లపై గౌరవ్ ఇచ్చిన స్పీచ్‌కు అతడు సంబరపడ్డాడని తెలిసింది. గౌరవ్, ఎలిజబెత్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలపై అస్సాం క్యాబినెట్ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. నిన్నటి నుంచే పని మొదలు పెట్టిన సీఐడీ నేడు ఒకరిపై FIR నమోదు చేయడం గమనార్హం.