News November 25, 2024
RGV ఇంటికి పోలీసులు.. అరెస్టుకు రంగం సిద్ధం?
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను అరెస్టు చేసేందుకు ఒంగోలు పోలీసులు సిద్ధమయ్యారు. ఇవాళ ఉదయమే ఆర్జీవీ ఇంటికి చేరుకున్నారు. ఆయన విచారణకు సహకరించకపోతే వెంటనే అరెస్టు చేసి ఒంగోలుకు తరలించనున్నట్లు సమాచారం. రెండు సార్లు నోటీసులివ్వగా ఆయన గడువు కావాలని కోరిన విషయం తెలిసిందే. చంద్రబాబు, లోకేశ్‌పై అనుచిత పోస్టులు పెట్టారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదవడం విదితమే.
Similar News
News December 14, 2024
TODAY HEADLINES
* అల్లు అర్జున్ అరెస్ట్.. మధ్యంతర బెయిల్ మంజూరు
* అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు
* సంధ్య థియేటర్ కేసు.. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న CM రేవంత్
* స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన CM చంద్రబాబు
* నీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తున్నాం: YS జగన్
* హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌కు బెయిల్
* ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్‌కు ICC ఆమోదం
News December 14, 2024
అల్లు ఫ్యామిలీ, ఫ్యాన్స్‌కు నిరాశ
అల్లు అర్జున్ రేపు ఉదయం విడుదల కానున్నారని జైలు అధికారులు వెల్లడించడంతో అల్లు ఫ్యామిలీ, ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. కోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో జైలు నుంచి ఆయన విడుదల అవుతారని సాయంత్రం నుంచి చంచల్‌గూడ జైలు బయట ఎదురుచూసిన అభిమానులు అసహనంతో వెనుదిరిగారు. అటు, అల్లు కుటుంబం కూడా రాత్రికి బన్నీ తిరిగొస్తాడని ఆశగా ఎదురు చూడగా నిరాశే మిగిలింది.
News December 14, 2024
అల్లు అరవింద్‌కు సీఎం చంద్రబాబు ఫోన్
అల్లు అర్జున్ తండ్రి అరవింద్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టు ఘటనపై ఆరా తీసి పరామర్శించారు. ఈ ఘటనపై ఆందోళన చెందవద్దని అరవింద్‌కు సూచించారు. కుటుంబం మొత్తం ధైర్యంగా ఉండాలని భరోసా నింపారు.