News February 4, 2025
బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషాపై పోలీసులకు ఫిర్యాదు
హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య మరోసారి నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషాపై ఆమె ఫిర్యాదు చేశారు. తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేశారని ఆధారాలతో సహా ఫిర్యాదులో పేర్కొన్నారు. మస్తాన్‌సాయి, శేఖర్ బాషా కాల్ సంభాషణలను అందజేశారు. పలువురు మహిళల అభ్యంతరకర వీడియోలు కలిగి ఉన్నారని మస్తాన్ సాయిపై నిన్న లావణ్య ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News February 4, 2025
రతన్ టాటా యువ స్నేహితుడికి కీలక పదవి
దివంగత వ్యాపారవేత్త రతన్ టాటా యువ స్నేహితుడు శంతను నాయుడుకు టాటా కంపెనీలో కీలక పదవి దక్కింది. స్ట్రాటజీస్ ఇనిషియేటివ్స్ విభాగానికి హెడ్, GMగా నియమితులైనట్లు శంతను LinkedInలో పోస్ట్ చేశారు. తన తండ్రి టాటా మోటార్స్ ప్లాంట్‌లో పని చేసేటప్పుడు వైట్ షర్ట్, నేవీ కలర్ ఫ్యాంట్ ధరించేవారని పేర్కొన్నారు. ఆయన కోసం తాను కిటికీ దగ్గర కూర్చొని ఎదురు చూసేవాడినని చిన్నప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు.
News February 4, 2025
కుంభమేళా తొక్కిసలాట అంత పెద్దదేమీ కాదు: హేమామాలిని
ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట అంత పెద్దదేమీ కాదని BJP MP హేమామాలిని అన్నారు. కానీ కొందరు దీనిని పెద్దదిగా చూస్తున్నారని మండిపడ్డారు. ‘మేమూ కుంభమేళాకు వెళ్లి సంగం ఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరించాం. తొక్కిసలాటలో భక్తులు మరణించడం బాధాకరం. ఈ ఒక్క ఘటన తప్ప కుంభమేళా అద్భుతంగా కొనసాగుతోంది’ అని పేర్కొన్నారు. కాగా UP సర్కార్ కుంభమేళా మృతుల సంఖ్యను దాచిపెడుతోందని మాజీ CM అఖిలేశ్ ఆరోపించారు.
News February 4, 2025
పార్టీ నేతలతో జగన్ కీలక సమావేశం
AP: YCP అధినేత YS జగన్ ఆ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, తదితరులు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు జగన్ హాజరు కావాలా? వద్దా? అని అంశమూ చర్చకు వచ్చినట్లు సమాచారం. భేటీ అనంతరం YCP భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.