News December 13, 2024

అల్లు అర్జున్‌తో మిస్ బిహేవ్ చేయలేదు: పోలీసులు

image

అల్లు అర్జున్‌ను బెడ్ రూమ్‌లోకి వెళ్లి అరెస్ట్ చేశారని, ఆయనతో తమ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని వస్తున్న వార్తలను పోలీసులు ఖండించారు. ‘మేము వారి ఇంటికి వెళ్లగానే దుస్తులు మార్చుకోవడానికి అల్లు అర్జున్ టైమ్ అడిగారు. తన బెడ్ రూమ్‌కు వెళ్లారు. పోలీసులు బయటే ఉన్నారు. ఆయన బయటకు వచ్చాకే కస్టడీలోకి తీసుకున్నారు. భార్య, కుటుంబంతో మాట్లాడేందుకు ఆయనకు సమయం ఇచ్చాం’ అని స్పష్టం చేశారు.

Similar News

News January 24, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల దావోస్ పర్యటన
* తెలంగాణకు రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఒప్పందం
* ప్రచారంలో ఉన్న లిస్టు ఫైనల్ కాదు: మంత్రి ఉత్తమ్
* టీడీపీలో CBN తర్వాత స్థానం లోకేశ్‌దే: అచ్చెన్నాయుడు
* మే నెలలో ‘తల్లికి వందనం’: డీబీ వీరాంజనేయ స్వామి
* దావోస్ ఖర్చెంత? పెట్టుబడులు ఎన్ని?: అంబటి
* మూడో రోజూ సినీ ప్రముఖుల ఇళ్లలో కొనసాగిన ఐటీ సోదాలు

News January 24, 2025

రాబోయే రోజుల్లో ఇలాగే వినోదాన్ని అందిస్తా: అనిల్ రావిపూడి

image

పదేళ్ల క్రితం తెరకెక్కించిన ‘పటాస్’ సినిమా ఇదే తేదీన విడుదలై తన జీవితాన్ని మార్చేసిందని దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. అది తన దర్శకత్వానికి పునాది మాత్రమే కాదని ఇప్పుడు తాను ఉన్న స్థాయికి కారణమని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో భాగమైన నిర్మాతలు, నటులు, ప్రేక్షకులు అంతా తన కుటుంబమేనని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ఇదే విధంగా అందరికీ వినోదాన్ని అందిస్తానని హామీ ఇస్తూ ధన్యవాదాలు తెలిపారు.

News January 24, 2025

స్వియాటెక్‌కు షాక్.. ఫైనల్లో ఆస్ట్రేలియన్ ప్లేయర్

image

టెన్నిస్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. రెండో సీడ్ స్వియాటెక్‌కు ఆస్ట్రేలియన్ ప్లేయర్ కేస్ షాకిచ్చారు. సెమీ‌ఫైనల్ మ్యాచులో 5-7, 6-1, 7-6 తేడాతో కేస్ గెలుపొందారు. ఏకపక్షంగా సాగిన మరో సెమీస్‌లో సబలంక 6-4, 6-2 తేడాతో బడోసాపై విజయం సాధించారు. ఎల్లుండి జరిగే ఫైనల్లో కేస్, సబలంక తలపడనున్నారు. మరోవైపు రేపు మెన్స్ సింగిల్స్ సెమీస్‌లో జకోవిచ్ రెండో సీడ్ జ్వెరెవ్‌తో అమీ తుమీ తేల్చుకోనున్నారు.