News August 18, 2024

ఫేక్ న్యూస్‌పై పోలీసుల నోటీసులు

image

కోల్‌క‌తాలో హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్ట‌ర్ పోస్టుమార్టం నివేదిక‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేసిన BJP నాయ‌కురాలు లాకెట్ ఛ‌ట‌ర్జీ, వైద్యులు కునాల్ సర్కార్, సుబర్ణ గోస్వామిలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. వ‌జైన‌ల్ స్వాబ్‌లో 150 గ్రాముల వీర్యం ఉన్న‌ట్టు, పెల్విక్ బోన్ విరిగిన‌ట్టు త‌ప్పుడు ప్ర‌చారం చేశార‌ని నోటీసుల్లో పేర్కొన్నారు. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు తమ ముందు హాజ‌రుకావాల‌ని ఆదేశించారు.

Similar News

News September 17, 2024

నేడే కేజ్రీవాల్ రాజీనామా.. కొత్త సీఎంపై సర్వత్రా ఉత్కంఠ

image

ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఇవాళ సాయంత్రం 4.30 గంట‌ల‌కు తన పదవికి రాజీనామా చేయనున్నారు. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సేనాను క‌లిసి రాజీనామా పత్రాన్ని అందిస్తారు. దీంతో తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఆప్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కేజ్రీవాల్ నివాసంలో స‌మావేశ‌మై చర్చించింది. అతిశీ, రాఘ‌వ్ చ‌ద్దా, సౌర‌భ్ భ‌ర‌ద్వాజ్‌, కైలాశ్ గ‌హ్లోత్ CM రేసులో ముందున్నారు.

News September 17, 2024

MBBS యాజమాన్య కోటా ఆప్షన్ల ఎంపికకు నోటిఫికేషన్

image

AP: ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2024-25కు గాను యాజమాన్య కోటా(B, C) ఎంబీబీఎస్ సీట్ల ఆప్షన్ల ఎంపికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 19 రాత్రి 9 గంటల వరకు అవకాశం ఉంటుంది. 25 కాలేజీల్లో 1,914 సీట్లుండగా, B కేటగిరీలో 1,318, C(ఎన్నారై) కేటగిరిలో 596 సీట్లు ఉన్నాయి.
వెబ్‌సైట్: <>http://drntr.uhsap.in<<>>

News September 17, 2024

ఆత్మవిశ్వాసంలో కోహ్లీకి ఎవరూ సాటిరారు: సర్ఫరాజ్ ఖాన్

image

విరాట్ కోహ్లీ యంగ్ ప్లేయర్లకు ఎప్పుడూ అండగా ఉంటూ విలువైన సూచనలు ఇస్తుంటాడని సర్ఫరాజ్ ఖాన్ ప్రశంసించారు. క్రికెట్ పట్ల ప్యాషన్, ఆత్మవిశ్వాసంలో ఆయనకెవరూ సాటిరారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. IPLలో 2015-18 మధ్య RCB తరఫున కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయనతో కలిసి టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవాలనే తన కల భవిష్యత్తులో నిజమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.