News February 14, 2025
వంశీని కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్

AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 10 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు విజయవాడ కోర్టులో పిటిషన్ వేశారు. ఆయన ఫోన్ సీజ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కూడా కోర్టులో కోరారు. సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసిన ఘటనలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయగా, ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సోమవారం ఈ పిటిషన్‌ను కోర్టు విచారించనుంది.
Similar News
News March 15, 2025
RCB: ఈసారైనా కప్ నమ్‌దేనా..!

IPL ఆరంభం నుంచి టైటిల్ కోసం RCB విశ్వప్రయత్నాలు చేస్తోంది. 17 సీజన్లు గడిచినా అది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఈసారైనా ఆ జట్టు కప్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. తనదైన రోజు ఏ జట్టునైనా ఓడించగలిగే RCBలో కోహ్లీ, పాటీదార్, లివింగ్‌స్టోన్, సాల్ట్, బేథేల్, జితేశ్, డేవిడ్ లాంటి హిట్టర్లు ఉన్నారు. బౌలింగ్‌లోనూ యశ్ దయాల్, భువీ, ఎంగిడి, హేజిల్‌వుడ్, తుషార్ ఉన్నారు. మరి RCB ఈసారి కప్ కొడుతుందా?
News March 15, 2025
బుమ్రాను ఆడగలననుకోవడం నా అమాయకత్వం: ఆస్ట్రేలియా బ్యాటర్

భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా బ్యాటర్ మెక్‌స్వీనీ ప్రశంసలు కురిపించారు. బుమ్రాను ఆడటం చాలా కష్టమని పేర్కొన్నారు. ‘ఆయన బౌలింగ్‌లో కష్టపడ్డానన్నది చాలా చిన్నపదం. బుమ్రా అత్యద్భుతమైన బౌలర్. అందరు బౌలర్లలా ఆయన్ను ఆడేయొచ్చని నేను అమాయకంగా పొరబడ్డా. అతడిని ఎదుర్కోవడం చాలా కష్టం. అయితే, బుమ్రా బౌలింగ్‌ను నాలాగే ఇతర బ్యాటర్లు కూడా ఆడలేకపోయారన్నది ఒక్కటే స్వల్ప ఊరట’ అని పేర్కొన్నారు.
News March 15, 2025
బెడ్‌పై తిని పడుకుంటే రూ.4.7 లక్షల జీతం

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) బంపరాఫర్ ఇచ్చింది. 10 రోజులపాటు వాటర్ బెడ్‌పై పడుకుంటే రూ.4.7 లక్షల జీతం చెల్లిస్తోంది. వాటర్‌ప్రూఫ్ ఫ్యాబ్రిక్‌తో స్పెషల్ బాత్ టబ్‌లు తయారు చేసింది. ఇందులో పడుకునే 10 మంది వాలంటీర్లకు ఫుడ్, డ్రింక్స్, ఫోన్ అన్ని సమకూరుస్తారు. ఈ 10 రోజులూ వారు ఆ బెడ్‌పై విశ్రాంతి తీసుకోవడమే పని. స్పేస్ జర్నీలో మానవ శరీరంపై ఉండే ప్రభావాలను అంచనా వేసేందుకే ESA ఈ ప్రయోగం చేపట్టింది.