News December 13, 2024
అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించిన పోలీసులు
హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. గాంధీ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం నాంపల్లి క్రిమినల్ కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. అటు గాంధీ ఆస్పత్రికి బన్నీని తరలించేందుకు వాహనాలను పోలీసులు సిద్ధం చేస్తున్నారు.
Similar News
News January 16, 2025
ఇన్ఫోసిస్: Q3లో రూ.6.806 కోట్ల లాభం.. 5,591 మంది నియామకం
డిసెంబర్ త్రైమాసికంలో రూ.6,806 కోట్ల నికర లాభాలను ఆర్జించినట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. 2023 DECతో(రూ.6,106 కోట్లు) పోలిస్తే 11.46 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. అదే సమయంలో కంపెనీ ఆదాయం 7.58 శాతం పెరిగి రూ.41,764 కోట్లకు చేరినట్లు పేర్కొంది. Q3లో కొత్తగా 5,591 మందిని రిక్రూట్ చేసుకోవడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3.23 లక్షలకు చేరుకున్నట్లు వివరించింది.
News January 16, 2025
పెన్&పేపర్ పద్ధతిలో NEET UG పరీక్ష
NEET UG పరీక్ష నిర్వహణపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది పరీక్షను పెన్&పేపర్(OMR) పద్ధతిలో కండక్ట్ చేస్తామని ప్రకటించింది. పరీక్షను ఒకే రోజున ఒకే షిఫ్టులో నిర్వహిస్తామని తెలిపింది. 2019 నుంచి నీట్(UG) పరీక్షను NTA నిర్వహిస్తోంది. గతేడాది ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైనట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే.
News January 16, 2025
వరుసగా నాలుగు రూ.100 కోట్ల సినిమాలు
నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే. దీంతో వరుసగా ఆయన నటించిన నాలుగు సినిమాలు రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాయి. బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కించిన ‘అఖండ’, గోపీచంద్ మలినేని ‘వీరసింహారెడ్డి’, అనిల్ రావిపూడి ‘భగవంత్ కేసరి’, బాబీ ‘డాకు మహారాజ్’ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టాయి. ఈ నాలుగింట్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి.