News August 22, 2024
రాత్రి వేళ మహిళలకు ఫ్రీ జర్నీ అంటూ ప్రచారం.. స్పందించిన పోలీసులు
TG: రాత్రి 10 నుంచి ఉదయం 6 మధ్య పోలీసులకు ఫోన్ చేస్తే మహిళలను ఇంటివద్ద ఉచితంగా దించుతారనే ప్రచారాన్ని హైదరాబాద్ పోలీసులు ఖండించారు. ‘మహిళలు 1091, 7837018555 నంబర్‌కు ఫోన్ చేస్తే స్థానిక పోలీసుల వాహనం వచ్చి తీసుకెళ్తుంది’ అని కొందరు వాట్సాప్‌లో ప్రచారం చేస్తున్నారు. ఈ మెసేజ్‌తో తప్పుదోవ పట్టిస్తున్నారని, ఉచిత రవాణా సౌకర్యం పేరిట తప్పుడు ప్రచారం జరుగుతోందని పోలీసులు స్పష్టం చేశారు.
Similar News
News September 13, 2024
2.35 లక్షల మందిపై ‘యాగీ’ తుఫాను ప్రభావం
యాగీ పెనుతుఫాను కారణంగా మయన్మార్‌లో సంభవించిన వరదలతో 2,35,000 మంది నిరాశ్రయులయ్యారని, 33మంది కన్నుమూశారని అక్కడి సర్కారు తెలిపింది. పలు ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయని, నదీప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. యాగీ కారణంగా వియత్నాం, లావోస్, థాయ్‌లాండ్, మయన్మార్ దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వరదలతో పాటు కొండచరియలు విరిగిపడటంతో పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు.
News September 13, 2024
‘హైడ్రా’పై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
TG: సంచలనం సృష్టిస్తున్న ‘హైడ్రా’పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా(జీవో 99) రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. GHMC యాక్ట్‌ను కాదని, హైడ్రాకు అధికారాల బదిలీ ఎలా చేస్తారని పిటిషనర్ ప్రశ్నించారు. కాగా HYDలోని చెరువుల FTL, బఫర్ జోన్లో ఆక్రమణలను హైడ్రా కూల్చివేస్తోంది.
News September 13, 2024
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి కేంద్రమంత్రులకు సీఎం ఆహ్వానం
TG: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 17న నిర్వహించనున్న ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం’ కార్యక్రమానికి హాజరుకావాలంటూ నలుగురు కేంద్రమంత్రులకు CM రేవంత్ ఆహ్వానం పంపారు. వీరిలో అమిత్ షా, గజేంద్ర షెకావత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారు. 1948 SEP 17న TGలో ప్రజాస్వామిక పాలన శకం ఆరంభమైన సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని CM తెలిపారు. ఆరోజు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఆయన జెండా ఆవిష్కరిస్తారు.