News March 1, 2025
దేశానికి రోల్ మోడల్లా పోలీస్ స్కూల్: సీఎం

TG: యంగ్ ఇండియా పోలీస్ స్కూలులో పోలీస్ అమరుల కుటుంబాల పిల్లలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. HYD మంచిరేవులలోని గ్రేహౌండ్స్ క్యాంపస్ సమీపంలోని ఈ స్కూలులో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. సైనిక్ స్కూల్ తరహాలో పోలీస్ స్కూల్‌ను దేశానికి రోల్ మాడల్‌గా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. స్కూల్ <
Similar News
News November 20, 2025
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా ఈ నెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, NOV 24 నాటికి వాయుగుండంగా, ఆ తర్వాత తుఫానుగా మారుతుందని ఇప్పటికే ఓ ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే.
News November 20, 2025
హిందీ Vs మరాఠీ వివాదం.. యువకుడు ఆత్మహత్య

హిందీ-మరాఠీ <<15354535>>వివాదం<<>> ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. MHలోని థానేకు చెందిన అర్ణవ్ ములంద్‌లోని కాలేజీకి వెళ్లేందుకు లోకల్ ట్రైన్ ఎక్కాడు. ఈక్రమంలోనే రైలులో హిందీ-మరాఠీపై చర్చ జరిగింది. ఇది కాస్తా గొడవకు దారి తీయడంతో ఐదుగురు యువకుల గ్యాంగ్ అర్ణవ్‌పై దాడి చేసింది. దీంతో అతడు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని అర్ణవ్ తండ్రి జితేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.
News November 20, 2025
రెండో టెస్టుకు భారత జట్టులో మార్పులివేనా?

గువాహటిలో ఎల్లుండి నుంచి సౌతాఫ్రికాతో జరిగే రెండో టెస్టుకు భారత జట్టులో రెండు మార్పులు జరిగే అవకాశముందని క్రీడా వర్గాలు తెలిపాయి. గిల్ స్థానంలో సాయి సుదర్శన్, పిచ్ కండిషన్‌ను బట్టి అక్షర్ పటేల్ ప్లేస్‌లో నితీశ్ కుమార్ రెడ్డిని ఆడించే ఛాన్స్ ఉందని పేర్కొన్నాయి. ఒకవేళ సాయి సుదర్శన్‌ను తీసుకోకపోతే దేవదత్ పడిక్కల్‌కు అవకాశం ఇస్తారని సమాచారం. ఎవరిని తీసుకుంటే బాగుంటుందో కామెంట్ చేయండి.


