News February 14, 2025
వంశీని కస్టడీకి కోరనున్న పోలీసులు

AP: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు 5 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. విజయవాడ కోర్టు అర్ధరాత్రి తర్వాత ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించగా, సబ్ జైలుకు తరలించారు. దీంతో ఆయన 27 వరకు రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. మరోవైపు వంశీ తరఫు న్యాయవాదులు ఇవాళ బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. వంశీని నిన్న హైదరాబాద్లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News January 19, 2026
నేడు మరోసారి CBI విచారణకు విజయ్

TVK చీఫ్ విజయ్ కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇవాళ మరోసారి ఢిల్లీలో CBI విచారణకు హాజరుకానున్నారు. నిన్న సాయంత్రమే ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. జనవరి 12న విజయ్ మొదటిసారి అధికారుల ముందు హాజరయ్యారు. అప్పుడు దాదాపు 7 గంటలపాటు ఆయనను అధికారులు ప్రశ్నించారు. సంక్రాంతి నేపథ్యంలో విజయ్ కోరిక మేరకు తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేశారు. కరూర్ తొక్కిసలాటలో 41మంది చనిపోయిన విషయం తెలిసిందే.
News January 19, 2026
మహిళలు శంఖానాదం చేయకూడదా?

మన ధర్మశాస్త్రాల ప్రకారం మహిళలు శంఖం ఊదకూడదనే నియమం ఎక్కడా లేదు. శంఖానాదం ఆధ్యాత్మికంగా సానుకూలతను ఇస్తుంది. అయితే శంఖం ఊదేటప్పుడు నాభి భాగంపై అధిక ఒత్తిడి పడుతుంది. ఇది మహిళల గర్భాశయ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. అందుకే పూర్వీకులు ఈ జాగ్రత్తను సూచించారు. గర్భిణీలు దీనికి దూరంగా ఉండటం ఉత్తమం. ఇది ఆరోగ్యపరమైన సూచనే తప్ప ఆంక్ష కాదు. శారీరక సామర్థ్యం ఉన్న మహిళలు నిరభ్యంతరంగా శంఖానాదం చేయవచ్చు.
News January 19, 2026
నేడు దావోస్కు CM రేవంత్

TG: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో పాల్గొనేందుకు నేడు సీఎం రేవంత్ దావోస్ వెళ్లనున్నారు. మేడారంలో మహాజాతరను ప్రారంభించాక ఉ.8 గం.కు హెలికాప్టర్లో HYD చేరుకుంటారు. ఉ.9.30గం.కు శంషాబాద్ నుంచి CM, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు పర్యటనకు వెళ్లనున్నారు. గూగుల్, సేల్స్ఫోర్స్, యూనిలివర్, లోరియల్, టాటా గ్రూప్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి సంస్థల అధినేతలతో రేవంత్ భేటీ అవుతారు.


