News October 7, 2024

జానీ మాస్టర్‌ బెయిల్ రద్దు కోసం కోర్టుకు పోలీసులు!

image

అత్యాచారం కేసు నేపథ్యంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డును నిలిపివేసిన విషయం తెలిసిందే. అంతకుముందు అవార్డు అందుకునేందుకు ఆయనకు రంగారెడ్డి కోర్టు 4 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు అవార్డు నిలిపివేయడంతో జానీ బెయిల్‌ను రద్దు చేయాలంటూ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. దీంతో ఆయనను మళ్లీ రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది.

Similar News

News November 4, 2024

రాష్ట్రంలో పెరిగిన భూగర్భ జలమట్టం

image

TG: ఈసారి కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయి. మేలో భూగర్భ జలమట్టం సగటున 10.36 మీటర్లు ఉండగా, అక్టోబర్‌లో అది 5.38 మీటర్లకు చేరింది. వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా 8.69 మీటర్లు, ఆదిలాబాద్ 7.66 మీ. భూపాలపల్లిలో 7.35 మీ. మహబూబ్‌నగర్‌లో 6.94 మీ. మేర జలమట్టం పెరిగింది. యాదాద్రి-భువనగిరి జిల్లాలో అత్యల్పంగా 2.64 మీటర్ల మట్టం పెరిగింది.

News November 4, 2024

హీరోయిన్‌ను కూడా హీరోలే డిసైడ్ చేస్తారు: తాప్సీ

image

సినీ ఇండస్ట్రీపై బోల్డ్‌గా మాట్లాడే హీరోయిన్ తాప్సీ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఒక సినిమాలో అప్పటికే పెద్ద హీరో ఉన్నాడంటే ఎక్కువ డబ్బు పెట్టి హీరోయిన్‌ను తీసుకోరని చెప్పారు. పైగా ఎవర్ని తీసుకోవాలనేది కూడా హీరోలే డిసైడ్ చేస్తారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లు మాత్రమే హీరో మాటను కాదని కథకు తగ్గట్లు హీరోయిన్లను ఎంపిక చేసుకుంటారని ఓ ఇంటర్వ్యూలో తాప్సీ చెప్పారు.

News November 4, 2024

దారుణంగా పడిపోయిన AQ.. లాహోర్ ఉక్కిరిబిక్కిరి

image

పాక్‌లోని లాహోర్‌‌లో ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయింది. అక్కడ AQI రికార్డ్ స్థాయిలో 1900 దాటింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్థానిక స్కూళ్లకు వారం సెలవులు ప్రకటించారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని హెచ్చరించారు. మనదేశంలో AQI అత్యధికంగా ఢిల్లీలో 300పైన నమోదవుతుంటుంది.