News November 23, 2024
రాజకీయ చాణక్యుడి ఘోర పరాభవం
మహారాష్ట్ర ఫలితాలు అపర చాణక్యుడిగా పేరొందిన శరద్ పవార్కు ఘోర పరాభవాన్ని మిగిల్చాయి. ఆయన పార్టీ కేవలం 13 స్థానాలకు పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. 2019లో 54, 2014లో 41, 2009లో 62, 2004లో 71 సీట్లు గెలిచిన శరద్ పవార్ సారథ్యంలోని NCP ఈ ఎన్నికల్లో చతికిలపడింది. 86 స్థానాల్లో పోటీ చేసినా ప్రభావం చూపలేకపోయింది. NCP SP మనుగడ ఇక కష్టమని పలువురు విశ్లేషిస్తున్నారు.
Similar News
News November 27, 2024
ALERT.. నేడు భారీ వర్షాలు
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ ఇవాళ తుఫానుగా బలపడే అవకాశముందని APSDMA పేర్కొంది. దీని ప్రభావంతో నేటి నుంచి 4 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది.
News November 27, 2024
RGV ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ
సినీ దర్శకుడు <<14719310>>రామ్ గోపాల్ వర్మ<<>> దాఖలు చేసిన 3 ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు, పవన్, లోకేశ్పై అసభ్యకర పోస్టులు పెట్టారని ఆర్జీవీపై ఒంగోలు, విశాఖ, గుంటూరులో కేసులు నమోదయ్యాయి. ఏడాది క్రితం పెట్టిన పోస్టులకు ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయా అంటూ తాజాగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు. తాను పరారీలో లేనని, మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నానని చెప్పారు.
News November 27, 2024
ఇజ్రాయెల్- హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ
కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్- హెజ్బొల్లా అంగీకరించాయి. ఇది నేటి నుంచే అమల్లోకి వస్తుందని ఇజ్రాయెల్ PM కార్యాలయం స్పష్టం చేసింది. లెబనాన్, ఇజ్రాయెల్ ప్రధానులతో మాట్లాడినట్లు, వారిద్దరూ వివాదం ముగింపునకు ఒప్పుకున్నారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. దీంతో ఇజ్రాయెల్- లెబనాన్ కేంద్రంగా హెజ్బొల్లా మధ్య కాల్పులను ఆపేందుకు US, యూరప్ దేశాలు, UNO చేసిన కృషికి ఫలితం దక్కినట్లైంది.