News November 23, 2024
రాజకీయ చాణక్యుడి ఘోర పరాభవం
మహారాష్ట్ర ఫలితాలు అపర చాణక్యుడిగా పేరొందిన శరద్ పవార్‌కు ఘోర పరాభవాన్ని మిగిల్చాయి. ఆయన పార్టీ కేవలం 13 స్థానాలకు పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. 2019లో 54, 2014లో 41, 2009లో 62, 2004లో 71 సీట్లు గెలిచిన శరద్ పవార్ సారథ్యంలోని NCP ఈ ఎన్నికల్లో చతికిలపడింది. 86 స్థానాల్లో పోటీ చేసినా ప్రభావం చూపలేకపోయింది. NCP SP మనుగడ ఇక కష్టమని పలువురు విశ్లేషిస్తున్నారు.
Similar News
News December 4, 2024
‘సీజ్ ద షిప్’ పేరిట మూవీ టైటిల్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోటి వెంట వచ్చిన మాట ఇప్పుడు ఓ సినిమాకు టైటిల్‌గా మారింది. ఇటీవల కాకినాడ పోర్టులో తనిఖీల సందర్భంగా ఆయన ‘సీజ్ ద షిప్’ అనే ఆదేశాలు ఇవ్వడంతో అప్పటినుంచి ఈ వాక్యం వైరలవుతోంది. తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఓ సినీ నిర్మాత రూ.1100 చెల్లించి ‘సీజ్ ద షిప్’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేసుకున్నారు.
News December 4, 2024
అన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి: జగన్
AP: కూటమి ప్రభుత్వంపై 6 నెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందని YCP అధినేత జగన్ అన్నారు. పార్టీ నేతల సమావేశంలో మాట్లాడుతూ ‘సూపర్ 6 అమలుపై ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన, ఆరోగ్య శ్రీ బకాయిలు, 104, 108 సిబ్బందికి జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. కరెంటు ఛార్జీలు పెంచారు. ప్రజలపై మరింత భారం మోపేందుకు సిద్ధమయ్యారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు’ అని ఆరోపించారు.
News December 4, 2024
WTC: తొలి రెండు స్థానాల్లో IND, SA
WTC పాయింట్స్ టేబుల్‌లో టీమ్ ఇండియా తొలి స్థానంలో కొనసాగుతోంది. SA రెండో స్థానానికి ఎగబాకగా, AUS మూడో స్థానానికి పడిపోయింది. తర్వాతి స్థానాల్లో వరుసగా SL, NZ, ENG, PAK, BAN, WI ఉన్నాయి. IND, SA, AUSలో ఏవైనా రెండు జట్లు ఫైనల్‌కు వెళ్లే ఛాన్స్ ఉంది. BGT సిరీస్ తర్వాత దీనిపై స్పష్టత రానుంది. WIపై BAN గెలవడం, స్లో ఓవర్ రేట్ కారణంగా NZ, ENGకు పాయింట్లలో ICC కోత విధించడంతో ర్యాంకింగ్స్ మారాయి.